ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని సాట్స్ మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి అన్నారు. వాళ్ళిద్దరు బీఆర్ఎస్ పార్టీ నుండి పదవులు పొంది, కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు, ఇది న్యాయం కాదన్నారు.
ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి మీరు స్వయంగా కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు, ఎమ్మెల్సీ కూచుకంట్ల దామోదర రెడ్డి గారు మీరు మీ కుమారుడిని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేయించి కాంగ్రెస్ పార్టీ నాగర్ కర్నూల్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇప్పించి ప్రచారంలో పాల్గొంటున్నారు. రాజకీయ విలువలు పాటించి మీరు తక్షణమే బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవులకు తక్షణమే రాజీనామా చేయండన్నారు.
కుచుకుళ్ల దామోదర రెడ్డి మీరు మీ కొడుకుకు నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కాంగ్రెస్ టికెట్ వస్తే రాజీనామా చేస్తానని అన్నారు, మాట నిలబెట్టుకొండి, మాట మీద నిలబడి తక్షణమే రాజీనామా చేయండని అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి సూచించారు.
బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ పార్టీ తరఫున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడంలో ఏంటి మీ ఆంతర్యం అని అడిగారు. ఏ మాత్రం నైతిక విలువలు ఉన్న రాజీనామా చేయండి, నైతిక రాజకీయ నియమాలు పరిధిని దాటి కాంగ్రెస్ పార్టీ తరఫున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మీకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఓటర్లు తగిన విధంగా బుద్ధి, తగిన రీతిలో గుణపాఠం చెప్తారని అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఉంటూ, బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయకుండానే, మీరు ఎలా ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేస్తరు, బీఆర్ఎస్ పార్టీ మీద మీరు ఇద్దరు ఎమ్మెల్సీగా గెలిచి కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ తీసుకుని పోటీ చేయడం అది మీ ఇష్టం కానీ రాజకీయ విలువలు పాటించాలి కదా? అని అడిగారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉంటూ కసిరెడ్డి నారాయణ రెడ్డి మీరు ఎట్లా కల్వకుర్తిలో పోటీ చేస్తున్నారు. దామోదర రెడ్డి మీరు కొడుకుకు ఎట్లా టికెట్ ఇప్పించారు ఇంకా మీరు ఎలా ఎమ్మెల్యేగా ఉంటారని ప్రశ్నించారు. ఇద్దరు కూడా రాజకీయ విలువలు పాటించకుండా రాజీనామా చేయకుండా ఎమ్మెల్సీగా కొనసాగడం న్యాయమేనా సబబేనా? అని అడిగారు. గొప్పలు చెప్పుకునే మీరు ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీ లో పోటీ చేయండి, సపోర్ట్ చేసుకోండి, మాకు అభ్యంతరం లేదన్నారు. కనుక తక్షణమే రాజీనామాలు సమర్పించండని పేర్కొన్నారు.