mt_logo

మేడిగడ్డ ఘటన వెనుక సంఘ విద్రోహ శక్తులు ఉన్నాయి – ఇరిగేషన్ శాఖా అధికారులు

మేడిగడ్డ లక్ష్మి బ్యారేజ్‌లోని 7వ బ్లాక్ వద్ద మూడు పిల్లర్లు కుంగడంపై మహదేవ్‌పూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పిల్లర్ కింద భారీ శబ్దం రావడంతో కుట్ర కోణం ఉందన్న అనుమానంతో ఫిర్యాదు ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు పిల్లర్లు కుంగటంపై కుట్ర ఉందన్న కోణంలో అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవికాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ 3, 4 సెక్షన్లతో పాటు ఐపీసీ 427 కింద కేసు నమోదు చేశారు. కేసు విచారణకు పోలీసులు ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేశారు.