mt_logo

బీఆర్ఎస్ పార్టీలోకి చేరేందుకు సుముఖత చూపిన విష్ణువర్ధన్ రెడ్డి

జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి ఇంటికి మంత్రి హరీష్ రావు, ఇతర నేతలు కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి  హరీశ్ రావు మాట్లాడుతూ..  పీజేఆర్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే పీజేఆర్, సీఎల్పీ పదవికి వన్నె తెచ్చింది పీజేఆర్ అని తెలిపారు. పేదల కోసం కృషి చేసిన గొప్ప నాయకుడు. ఉద్యమంలో విష్ణు మేము కలిసి పని చేసామని వెల్లడించారు. పులిచింతల కట్టవద్దని నిరసన తెలిపితే అధికార పార్టీ ఉండి కూడా విష్ణు మద్దతు తెలిపారని గుర్తు చేసారు. తెలంగాణ యువ నాయకుడు, తెలంగాణ కోసం ఎంతో చేశారు. ఉద్యమంతో ఎంతో అనుబంధం ఉందని తెలిపారు. 

విష్ణును బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. అంగీకరించారని తెలియ జేశారు. పీజేఆర్ గౌరవం కనపడేలా సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. 50 కోట్లకు టికెట్ అమ్ముకున్నారు అని కాంగ్రెస్ నాయకులే చెబుతున్నారు.  ఇలాంటి వాళ్ళ చేతుల్లో తెలంగాణ ఉంటే ఆగం అవుతుందిఓటుకు నోటు చేతిలో లంచం తీసుకున్న వ్యక్తి పీసీసీ చీఫ్,  పీసీసీ పదవి కూడా కొనుకున్నడు అని కాంగ్రెస్ నాయకులే అంటున్నారని ఈ సందర్భంగా తెలిపారు.