mt_logo

మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డిని కత్తితో పొడిచిన వ్యక్తిపై విచారణ ప్రారంభం

మెదక్ ఎంపీ, దుబ్బాక అసెంబ్లీ బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రచారంలో భాగంగా ఈరోజు దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో ప్రచారం చేస్తున్న సమయంలో దాడి జరిగింది.

పోలీసుల వివరాల ప్రకారం మిరిదొడ్డి మండలం పెద్ద చెప్యాల గ్రామానికి చెందిన గడ్డం రాజు అనే వ్యక్తి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని కలవడానికి దగ్గరికి వచ్చి కత్తితో పొడిచి హత్యయత్నం చేశాడు. వెంటనే అక్కడ ఉన్న కార్యకర్తలు తేరుకొని నిందితున్ని పోలీసులకు అప్పగించారు.

ప్రస్తుతం అతను పోలీస్ కస్టడీలో ఉన్నాడు. గాయపడిన ఎంపీ ప్రభాకర్ రెడ్డిని గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేసిన అనంతరం పరిస్థితి విషమంగా ఉన్నందున మెరుగైన చికిత్స గురించి హైదరాబాద్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. హత్యయత్నం చేసిన గడ్డం రాజుపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించడం జరిగిందని పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత ఒక ప్రకటనలో తెలిపారు.