mt_logo

కాంగ్రెస్, బీజేపీల మీటింగుల్లో ఖాళీ కుర్చీలు.. బీఆర్ఎస్ మీటింగులు జన సముద్రం

మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ ఎమ్యెల్యే అభ్యర్ధి శంకర్ నాయక్‌కి మద్ధతుగా నిర్వహించిన రోడ్ షోలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీల మీటింగులు చూస్తే ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నయి.  బీఆర్ఎస్ మీటింగ్ అంటే జన సముద్రంలా ఉన్నయని తెలిపారు. సమైక్య వాదులు దండయాత్రకు వచ్చిన రోజు మానుకోట ప్రజలు తరిమికొట్టారు. మానుకోటకు మట్టికి దండం మానుకోట రాళ్లకు దండం. మానుకోట దెబ్బతో సమైక్య వాదులు వెనుకకు పరిగెత్తారు. మళ్లీ సమైక్యవాదులు ఒక్కటై తెలంగాణ మీద దండెత్తడానికి వస్తుండ్రు. వారికి మన మానుకోట దమ్మేంటో చూపించాలని అన్నారు. 

కాళేశ్వరం ప్రాజెక్టు రేవంత్ రెడ్డి నెత్తిమీద కట్టాల్నా?

కార్యకర్తలు మంచిగా పని చేసి శంకర్ నాయక్‌ని మూడోసారి గెలిపించాలని కోరారు. మానుకోట రోడ్లు సిద్ధిపేట కంటే బాగున్నాయి. గులాబీ జెండా లేకుంటే మానుకోట జిల్లా అయ్యేదా? మెడికల్ కాలేజ్ వచ్చేదా? హార్టికల్చర్ కాలేజ్ వచ్చేదా? తండాలు గ్రామ పంచాయతీలు అయ్యేవా? పోడు భూములకు పట్టాలు వచ్చేవా? అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు కర్ణాటకలో ప్రచారం చేసి 5 గ్యారంటీలు అని ఊదరగొట్టి మోసం చేసిండ్రు. రేవంత్ రెడ్డికి ఏ విషయం మీద పూర్తి అవగాహన ఉండదు. కాళేశ్వరం ప్రాజెక్టు రేవంత్ రెడ్డి నెత్తిమీద కట్టాల్నా? అని ధ్వజమెత్తారు. లంబాడీలకు అత్యధిక ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చింది కేసీఆరే అని తేల్చి చెప్పారు. ఎస్సీ, ఎస్టీలకు పది శాతం రిజర్వేషన్ ఇచ్చింది కూడా కేసీఆరే అని స్పష్టం చేసారు. మీ ఆఖరి డిమాండ్ అయిన గిరిజన బంధును ఈ సారి పక్కాగా అమలు చేస్తాం అని తెలిపారు.