mt_logo

రైతుభరోసా కింద కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రూ. 26,775 కోట్లు బాకీ పడ్డది: కేటీఆర్

రైతు భరోసాపైన అసెంబ్లీలో జరిగిన స్వల్పకాలిక చర్చలో పాల్గొని ప్రసంగించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈరోజు సభలో ప్రభుత్వం చేసిన ప్రకటనపైన పలు ప్రశ్నలు లెవనెత్తారు. ఈ ప్రభుత్వం చర్చ సందర్భంగా రైతు భరోసా విషయంలో కోతల విధించేందుకు పీఎం కిసాన్ విధివిధానాల గురించి ప్రస్తావించారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

పండించిన పంటలకే రైతు భరోసా అంటూ కోతలు విధించే ప్రయత్నం చేస్తుందన్నారు. సాగు చేసే భూములకు మాత్రమే రైతుబంధు ఇస్తామని చెప్పడం వల్ల అనేక మంది రైతులు రైతు భరోసాని కోల్పోతారని అవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అనేక చోట్ల మూడు పంటలు కూడా పండిస్తారు.. మరి మూడుసార్లు రైతుబంధు ఇస్తారో లేదో ప్రభుత్వం చెప్పాలని కోరారు. సంవత్సారానికి ఒకే పంటగా ఉండే పత్తి పంటకు రెండు సార్లు ఇస్తారా..ఇవ్వరా.. అనేది చెప్పాలన్నారు.

పామాయిల్ లాంటి వాణిజ్య పంటలతోపాటు. జామా, మామిడి వంటి ఉద్యాన వన పంటలకు రైతు భరోసా ఉంటుందా లేదో స్పష్టం చేయాలన్నారు. రైతు భరోసాపైన ఈరోజు సభలో ప్రభుత్వ నిర్ణయం చెప్పకుంటే చర్చ పెట్టి ఏం లాభం అన్నారు.

రైతు భరోసా కోసం బడ్జెట్లో కేటాయించింది కేవలం. రూ.15,075 కోట్లు.. 70 లక్షల మంది రైతన్నలకు 1.53 కోట్ల ఎకరాల చొప్పున ప్రతి సీజన్లో 15000 ఇవ్వాలి అంటే రూ.23 వేల కోట్లు అవసరమని కానీ 15 వేల కోట్లు మాత్రమే బడ్జెట్లో కేటాయించారన్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం కోతలకు సిద్ధపడిన తర్వాతనే ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది అనేది సుస్పష్టంమన్నారు.

రైతుబంధు నెత్త కొట్టే ప్రయత్నం చేస్తున్నారు అందుకే టైం పాస్ చేస్తున్నారు. ఆరోజు హామీలు ఇచ్చినప్పుడు అందరికీ అన్ని అని చెప్పి ఇప్పుడు కొందరికి కొన్ని అని చెప్తున్నారు. ఇప్పుడు కోతల పేరుతో కొత్త కథలు చెబుతున్నరన్నారు. రాష్ట్రంలో ఈరోజు పాన్ కార్డులు ఉన్నవాళ్లు కోటి యాభై లక్షల మంది ఉన్నారని, వారందరికీ రైతుబంధు కట్ చేస్తారా అని ప్రశ్నించారు.

ఈ రోజుల్లో ఉన్న రుణ వ్యవస్థ అర్హతల ప్రకారం గ్రామాల్లోనూ ఐటీ చెల్లింపులు, పాన్ కార్డులు కలిగిన వ్యక్తులు, రైతన్నలు ఉన్నారు.. వారందరికీ ఎగబెడతారా అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వమని చెప్తున్నారు, ప్రభుత్వ ఉద్యోగులకు భూమి బంధం తెంపి వేస్తారా ,రైతు బిడ్డ ప్రభుత్వ ఉద్యోగి అయితే తరతరాలుగా వాళ్లకి భూమితో ఉన్న బంధాన్ని తెంపివేస్తారా అన్నారు.

వేంటనే మంత్రి వర్గ ఉప సంఘం నివేదికను రాష్ట్రం ముందు పెట్టాలి. కాంగ్రెస్ ప్రభుత్వ ఖజానా మొత్తం అంతా కర్షకుడే మింగేసినట్లు గోరంతలు చేసి ప్రాపకండా చేస్తున్నారు గుట్టలకు, పుట్టలకు రైతుబంధు అని చెప్పి అనేక కట్టు కథనాలు రాయించారన్నారు. నాడు రేవంత్ రెడ్డి చెప్పినట్లు కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వాలన్నారు.

రేవంత్ గతంలో కౌలు రైతులకు ఇవ్వాలి.. వారు వెయిట్ చేస్తున్నారన్నారు. నిన్న భూభారతిలో పెట్టిన అనుభవదారు కాలమ్ పెట్టినారు కాబట్టి వేంటనే 22 లక్షల మంది కౌలుదార్లకు రైతు భరోసా ఇవ్వాలన్నారు.

పోయిన యాసంగి రూ. 2500.. నిన్న వానాకాలం రూ. 7500.. ఇప్పుడు యాసంగి రూ. 7500.. ఇలా మెత్తంగా ఒక్కో రైతుకు కాంగ్రెస్ ఎకరానికి రూ. 17,500 బాకీ పడ్డదన్నారు. ఈ విషయాన్ని రైతులందరూ గుర్తుంచుకోవాలన్నారు. రెండు విడతల రైతు భరోసాతోపాటు, ఒక విడత 5000 వేలే ఇచ్చి ఎగ్గొట్టిన 2500 కలిపితే.. రూ.17500 మేర సుమారు రూ. 26,775 కోట్ల రూపాయలు రైతన్నలకు బాకీ పడింది. ఈ మెత్తం రైతన్నలకు ఇచ్చేదాకా మా పార్టీ వదిలపెట్టదన్నారు.

కాంగ్రెస్ పార్టీ రైతన్నలకు ఇచ్చిన హమీలను చర్చ సందర్భంగా కెటిఅర్ బలంగా ఎండగట్టారు. ఎన్నికలకు ముందుు ముష్టి పదివేలు ఎందుకు? ఎకరానికి 15వేల రైతుభరోసా.. ఇస్తామన్నారు, రెండు పంటలకు కాదు మూడు పంటలకు రైతు బందు ఇవ్వాలని ముచ్చట్లు చెప్పారనన్నారు. ఇప్పుడు తీసుకుంటే 5వేలు.. డిసెంబర్ 3 తర్వాత తీసుకుంటే 7500 అని ఎన్నికల సభల్లో చెప్పారని కానీ ఇప్పటిదాకా రైతుభరోసా వేస్తనేలేరన్నారు.

అందుకే అంటున్నాం… రైతన్నలను తగ్గించకండి.. ఇదే కాంగ్రెస్ నేతలను రైతు బందు అపమని లేఖలు రాసినారని, ఎన్నికల కోడ్ వల్లన ఇయ్యలేక పోయాయని, అవే డబ్బులను ఒక్కసారి రైతులకిచ్చి, రెండుసార్లు ఎగవేసిందన్నారు. మార్పు మార్పు అని పేరు మార్చి రైతు భరోసా అని అవే రూ. 5 వేలు ఇచ్చారన్నారు.

11 సీజన్లు.. 73 వేల కోట్లు.. రైతు ఖాతాల్లో నేరుగా సొమ్ము ఇచ్చామని తెలిపారు. మా ప్రభుత్వం తెచ్చిన రైతుబందు దేశ వ్యాప్తంగా అనేక ప్రసంశలు అందుకున్నదన్నారు. ఒడిషా..బెంగాల్..సహా అనేక రాష్ట్రాలు రైతుబంధును ఆదర్శంగా తీసుకొని నగదు బదిలీ పథకాలను ప్రవేశ పెట్టాయని తెలిపారు.

కేంద్రంలోని బీజేపీ కూడా మా రైతుబంధును కాపీ కొట్టి ప్రధానమంత్రికి పథకాన్ని ప్రారంభించింది కానీ పీఎం కిసాన్‌లో అనేక కోతలను పెట్టిందన్నారు. అశోక్ గులాటీ.. అరవింద్ సుబ్రహ్మణ్యం.. రఘురాంరాజన్.. అభిజిత్ బెనర్జీ.. దేవిందర్ శర్మమ లాంటి ఎకనామిస్ట్‌లు.. ఆగ్రో ఎకనామిస్టులు నుంచి.. ఐక్య రాజ్య సమితి దాకా అందరి ప్రశంసలు అందుకున్న స్కీం.. రైతును ఆదుకోవాడనికి.. వ్యవసాయాన్ని కాపాడుకోవడానికి రైతబంధు తరహా పథకాలే మేలు అని ఆర్థికవేత్తలు.. వ్యవసాయ వేత్తలు ముక్తకంఠంతో చెప్పారు.

రైతుబంధుపైన కాంగ్రెస్ భారీగా దుష్పచారం చేసిందన్నారు. కానీ వాస్తవానికి నూటికి 98 శాతం.. బక్క రైతులే వున్నారు తెలంగాణలో ఉన్నారని, అందుకే.. చిన్నా పెద్దా అనే తేడాలేకుండా.. ముందు వ్యవసాయ రంగం గాడిన పడేదాకా.. అందరికి ఇవ్వాలని ఒక పాలసీగానే నిర్ణయం తీసుకున్నామని కేటీఆర్ తెలిపారు. వ్యవసాయ రంగం స్ధిరీకరణ జరిగేదాకా బలోపేతం అయ్యేదాకా రైతుబంధు పైన ఎలాంటి ఆంక్షలు పెట్టలేదన్నారు.

గతంలో రైతుబంధు పొందిన రైతన్నల్లో 98% బడుగు బలహీన చిన్న సన్నకారు వర్గాల రైతులే ఉన్నారని తెలిపారు. మహబూబ్నగర్ లాంటి జిల్లాలో 20-30 ఎకరాల భూమి ఉన్న రైతు కూడా వలస కూలీలుగా వెళ్లే పరిస్థితి ఉండెదన్నారు. అందుకే రైతులకు రైతుబంధు ఆర్థిక సహాయం చేసినప్పుడు మేము ఎకరాలు అనే పరిమితులు ఏమి పెట్టలేదు.

ముందుగా వ్యవసాయని బలోపేతం చేయాలన్న ఏకైక ఉద్దేశంతోనే రైతులందరికీ భూములతో పాటు పంటలతో పాటు సంబంధం లేకుండా అందర్నీ సమదృష్టితో చూసామని అందుకే మా ప్రభుత్వ హాయంలో ఆకలి కేకల నేల అన్నపూర్ణగా అవతరించిందిని, రైతు విలువ పెరిగిందన్నారు. మా హాయంలో భూమి విలువ పెరిగింది! సాగు సంబురమైందన్నారు.

తెలంగాణ రైతు పచ్చబడితే కొందరి కళ్లు ఎర్రబడ్డాయి. అన్నదాత బాగుపడితే ఓర్వలేకపోయారు కొందరు అంటూ కాంగ్రెస్ పైన చురకలు వేశారు. వందల ఎకరాల పెద్ద రైతులకు లాభమని.. పనిగట్టుకొని దుష్ప్రచారం చేసారు. తెలంగాణ బడుగు బలహీనవర్గాల రాష్ట్రం. నూటికి 95 శాతం బక్క రైతులేఅని, రైతుబంధుతో చిన్న సన్నకారు రైతులకు ఇతోధికంగా మేలు జరిగిందన్నారు. ఈ సందర్భంగా కొన్ని లెక్కలను వివరించారు. 91.33శాతం లబ్ధి దారులు 5 ఎకరాలు కంటే తక్కువ భూమి వున్న చిన్న సన్నకారు రైతులే అని, 5 నుంచి 10 ఎకరాలు వున్నమధ్య తరగతి రైతులు 7.28 శాతం, 10 ఎకరాలు పైబడి వున్నవాళ్లు 1.39 శాతమే ఉన్నారు. 25 ఎకరాలపైన ఉన్న పెద్ద రైతులు కేవలం 0.09 శాతం మాత్రమే ఉన్నారు.

అయితే 72 వేల కోట్లరైతు బందులో కేవలం పెద్ద రైతులకు పోయింది కేవలం 1.39 శాతమే అని ప్రభుత్వం గుర్తించుకోవాలన్నారు. ఈ 80 శాతం లబ్ధిదారులు దళిత గిరిజన బహుజన రైతులే! ఉన్నారు (బీసీ- 54.. ఎస్సీ-13.. ఎస్టీ-13 శాతం) మెత్తం రైతు బందు నిధుల్లో 70 శాతం రైతుబంధు పైసలు బీసీ..ఎస్సీ..ఎస్టీ రైతుల ఖాతాల్లోనే పడ్డాయన్నారు. పోడు భూములకు పట్టాలిచ్చి.. గిరిజన ఆదివాసీ రైతులకు సైతం రైతుబంధు పైసలు ఇచ్చామన్నారు. పోడు భూములకు రైతుబంధు ఇచ్చిన తర్వాత మొత్తం లబ్ధిదారుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీల వాటా ఇంకా పెరిగిందన్నారు.

మట్టిని నమ్ముకొని బతికే రైతుకు ఎంత చేసినా..ఏమిచ్చినా తక్కువే అన్నది మా విధానమన్నారు. అన్నదాత విషయంలో కోతలు ఏగవేతాలు వద్దనుకున్నాం.. రైతుకు చేసే సాయం.. దానధర్మంగా చూడొద్దన్నారు. అన్నదాతకు ఇచ్చే భరోసాను భారంగా చూడవద్దు… భాద్యతగా చూడాలి.

47 శాతం మంది ప్రజలకు వ్యవసాయ రంగమే ఉపాధి ఇస్తుందని గుర్తుంచుకోవలన్నారు. రైతన్నల బతుకుదెరువు బాగుండాలంటే.. పరిశ్రమలకు ఇచ్చినట్టే రైతుకు రాయితీలు.. ఇన్ పుట్ సబ్సిడీలు ఇచ్చి తీరాలని, పరిశ్రమలకు రాయితీల మాదిరే… రైతన్నల పంటకు కూడా ప్రొత్సాహకాలివ్వాలన్నారు. విత్తనం వేసిన నాటి నుంచి..పంట అమ్మేదాక రైతుకు ఎన్ని గండాలు..ఎన్ని కష్టాలుంటాయని, అందుకే ఏలాంటి పరిమితులు లేకుండా రైతు బందు ఇచ్చినమన్నారు.

పండించిన ప్రతి పంటకు మద్దతు ధరకు అదనంగా 500 బోనస్ ఇస్తామని మ్యానిపెస్టోలో చెప్పారు. కాంగ్రెస్ మ్యానిపెస్టోలో చెప్పినట్టు ప్రతి పంటకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో మార్పు అని ఊదరగొట్టింది కానీ చివరికి రైతుబంధును పేరు మార్చి రైతుబంధును రైతు భరోసాగా పేరు మార్చింది.

ఇదేనా మీరు తేస్తామన్న మార్పు అని కెటిఅర్ ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే తొలి క్యాబినెట్ మీటింగ్ లోనే హామీలకు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ ఏమైంది.. మరీ 12 నెలలైనా తొలి క్యాబినెట్ జరగలేదా.. లేక రాహుల్ అనుమతి రాలేదా అన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతు బతుకుకు భరోసా లేదు రైతు భూమికి భరోసా అంతకన్నా లేదన్నారు. పొలంలో ఉండాల్సిన రైతులు జైళ్లలో ఉండాల్సి వస్తుందని, రైతన్న చేతికి సంకెళ్లు వేస్తున్నారన్నారు.

రాష్ట్రంలో ఏ గ్రామంలో అయిన 100 శాతం రుణమాఫీ అయితే తాను రాజకీయ సన్యాసం చేస్తానన్న కెటిఅర్, ఇందుకోసం ముఖ్యమంత్రి సొంత గ్రామం కొండారెడ్డి పల్లెకి అయినా వెళ్ధామన్నారు. మరోవైపు రుణమాఫీ కూడా చేస్తామని నమ్మబలికిందని, రూ. 49,500 కోట్ల రూపాయల నుంచి అవసరమైతే.. డెడ్ లైన్లు, అడ్డగోలు మాటలతో రుణమాఫీ ఎత్తగొడుతున్నారు.

డిసెంబర్ 9 తేదీన.. ఏకకాలంలో 2 లక్షల మాఫీ అన్నారు,రేపే బ్యాంకులకు ఉరికురికి లోన్ తెచ్చుకోండని చెప్పారని, ఒక ఏడాది కడుపు, నోరు కట్టుకుంటే 40వేల కోట్లు కష్టంకాదన్నారు. మాఫీ చేయడం..ఈజీ అన్నారు. మొన్న జూన్ కేబినెట్ నిర్ణయాల్లో 31 వేల కోట్లు మాఫీ.. 47 లక్షల మందికి లబ్ధి అని ప్రకటించారు.

నిన్న బడ్జెట్‌లో రూ.26వేల కోట్లు కేటాయించారు. తీరా..ఆఖరికి తేలిందని, 17,934 కోట్లు రూపాయలు.. 22 లక్షల 37వేల 848 మంది రైతులకే రుణమాఫీ అని చెప్పారు. తమకు రుణమాఫీ ఎందుకు కాలేదో అర్థంకాక.. లక్షలాది మంది రైతులు ఆందోళనలో ఉంటే.. కాంగ్రెస్ సంబరాలు చేసుకుంటుందన్నారు. రైతు భరోసాను ఎత్తగొట్టి రైతు రుణమాఫీ పేరిట చేసిన డ్రామా ఫెయిలైపోయిందన్నారు. ఏన్నికల ప్రచారంలో అందరికీ అన్నీ అన్నారు. ఇప్పుడు కొందరికే కొన్ని అని ఎందుకు కొంగజపం చేస్తున్నారని మండిపడ్డారు.

ముఖ్యమంత్రి తమ ఎమ్మెల్యేలకు సరైన ట్రైనింగ్ ఇవ్వాలి ముఖ్యమంత్రి 100% రుణమాఫీ అంటున్నారు.. ఎమ్మెల్యే 70 శాతం అంటున్నారు బయట రైతన్నలు మాత్రం 20% కూడా కాలేదు అంటున్నారు. లఘుచర్లలో రైతన్నలను జైలులో పెట్టినట్లుగా, అదానీ కోసము అన్నద్దమ్ముల కోసమో, అల్లుడి కంపెనీల కోసమో, బావమరిది అమృతం కోసం కాకుండా రైతన్నలకిచ్చిన హమీల అమలు కోసం పనిచేయాలని సిఎం కు విజ్ఞప్తి చేస్తున్నానని కెటిఅర్ అన్నారు.

ఈరోజు 24 గంటల పాటు రాష్ట్రంలోని రైతన్నలకు విద్యుత్ సరఫరా చేస్తున్నట్టు లాగ్ బుక్కుల్లో చూపిస్తే మా పార్టీ శాసనసభ్యులమంతా రాజీనామా చేస్తాం. మా ప్రభుత్వం గతంలో 19 1/2 గంటల పాటు నిరంతర విద్యుత్తు ఇచ్చిందని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన శ్వేతపత్రంలోనే పేర్కొన్నారు

నల్గొండ జిల్లా పైన జరిగిన అభివృద్ధి పైన ప్రత్యేకంగా చర్చ పెడతామన్న మాకేం ఇబ్బంది లేదు.. మేము సిద్ధంగా ఉన్నాను. రాష్ట్రంలో అందరికంటే ఎక్కువగా వరి ధాన్యం పండించిన నల్గొండ జిల్లాను వ్యవసాయ రంగం తీర్చిదిద్దాము. మా మెడ మీద కేంద్ర ప్రభుత్వం కత్తిపెట్టినా.. 30 వేల కోట్ల రూపాయలను వదులుకున్నాము కానీ వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టలేదు. కోమటి రెడ్డికి దమ్ముంటే ఏ నల్లోగొండ గ్రామానికైనా పోదాం.. నీళ్లు ఇచ్చింది ఏవరో చెప్పాలి అని అన్నారు.

గతంలో తెలంగాణ పరిస్ధితిని గుర్తు చేస్తూ… రేవంత్ రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ రంగ పరిస్థితి పైన గ్రామాల పరిస్థితి పైన ఇచ్చిన స్పీచ్‌ను ప్రస్తావించిన కేటీఆర్. ఆనాడు గ్రామాల్లో చనిపోతే కూడా స్నానాలు చేసేందుకు నీళ్లు లేని దుఃఖ భరితమైన పరిస్థితి ఉందని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు రైతు ఆత్మ హాత్యలపైన ప్రశ్నలు అడిగితే తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యలు పూర్తిగా తగ్గిన విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే స్వయంగా చెప్పిందని గుర్తు చేశారు.

గోరేటి ఎంకన్న రాసిన సేతానం ఏడుందిదా..తెలంగాణ చేలన్ని బీళ్లాయెరా పాటతోపాటు… పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రాలా అనే పాటలను ప్రస్తావించారు. ఆనాడు పాలకుల కర్కషత్వం, నిరంకుశత్వంపైన గద్దర్ అన్న పాట గుర్తొస్తుందని, దుక్కులు దున్నే రైతు చేతుల బేడీలెందుకురో.. మొక్కలు రైతు కూలీలను జైలులో పెట్టిండ్రు అన్న.. అని పాడిండన్న కేటీఆర్, ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న పరిణామాలను చూసినకా, ఇవాళ గద్దర్ అన్న మన మధ్య ఉండుంటే… మళ్లీ గజ్జగట్టి ఈ కాంగ్రెస్ సర్కారుపై ఇదే పాట అందుకొని గర్జించేవాడు
రైతన్నకు ఎంత ఇచ్చినా.. ఎం ఇచ్చిన తక్కువనే అనే అంశంలో శ్రీశ్రీ కవితను కేటీఆర్ ప్రస్తావించారు.

ఆహార పంటల ఉత్పత్తి 71 లక్షల టన్నుల నుంచి 2 కోట్ల టన్నులకు పెరిగింది! 185 శాతం వృద్ధితో అదనంగా 1 కోటి 30 లక్షల టన్నుల ఆహార పంటల ఉత్పత్తి పెరిగింది. పంటల సాగు నాడు రెండు పంటలు కలిపి కోటీ 31 లక్షల ఎకరాలు ఉంటే నేడు.. 2 కోట్ల 29 లక్షల ఎకరాలుకు పెరిగింది. కొత్తగా కోటి ఎకరాల పంటల సాగు పెరిగింది అని కేటీఆర్ అన్నారు.

నీరు పళ్ళమెరుగు.. నిజం దేవుడెరుగు అంటారు.. కానీ సంకల్ప బలం ఉంటే పాతాళంలో ఉన్న నీటిని ఎంత ఎత్తుకైనా ఎత్తవచ్చుని అక్షరాల నిరూపించిన ధీరోదాత్తమైన నాయకుడు కేసీఆర్ గారు. ఓవైపు ఉత్తర తెలంగాణకు వరప్రదయిని లాంటి కాళేశ్వరం ప్రాజెక్ట్.. మరోవైపు దక్షిణ తెలంగాణకు కల్పతరువు లాంటి పాలమూరు ప్రాజెక్టుతోపాటు భక్తరామదాసు, సీతారామ ప్రాజెక్టులను చేపట్టి తెలంగాణను సస్యశ్యామలం చేశాం అని తెలిపారు.

దశాబ్దాల పాటు కరువు కాటకాలతో అల్లాడిన తెలంగాణ, ఇవాళ మా పదేళ్ల పాలన తో పాడిపంటల తెలంగాణగా మార్చినం సాగునీటి పారకం..2014లో 62 లక్షల 50వేల ఎకరాలు ఉంటే 2023 నాటికి అది కోటీ 60 లక్షల ఎకరాలకు చేరింది! 155 శాతం పెరుగుదలతో తెలంగాణలో అదనంగా సూమారు కోటి ఎకరాలు (98లక్షల)కు సాగులోకి తెచ్చాం. 10 ఎండ్లతో సాగు చేయని రైతన్నలకు ప్రొత్సాహాకాల ఇవ్వడం వల్లనే భారీగా సాగు పెరిగింది. బియ్యం ఉత్పత్తి లో రైతన్నలు మనం గర్వపడేలా పంటలు పండించారు అని అన్నారు.

వరి పంటలో ఎక్కడో పది.. పదకొండు స్థానం నుంచి ప్రథమస్థానానికి ఎగబాకినం. 2013-14 బియ్యం ఉత్పత్తి 57 లక్షల టన్నులు నుంచి 2023-24 నాటికి కోటి 68 లక్షల టన్నులకు పెరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ తెలంగాణ కలిపి కూడా ఎఫ్సీఐకి కొలిచిన ధాన్యం 90 లక్షల టన్నులు దాటలేదు కానీ 2021లో ఒక్క తెలంగాణనే కోటి 41 లక్షల టన్నుల వడ్లను ఎఫ్ సీ ఐకి ఇచ్చాం! తెలంగాన రైతన్నలు పండించిన దాన్యం కొనలెేక ఎఫ్సీఐ చేతులెత్తేసింది అని పేర్కొన్నారు.

10 ఎండ్లలో రైతన్న నుంచి మా ప్రభుత్వం కొనుగోలు చేసిన దాన్యం విలువ అక్షరాల లక్షా 34 వేల కోట్లు. 2014-15లో కోనుగోలుచేసింది 24 లక్షల టన్నులుంటే 2022-23 లో కోనుగోలు చేసిన దాన్యం కోటి 30లక్షల టన్నులకు చేరింది.. దేశంలోని మొత్తం రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ సూసైడ్స్ 2015లో 11 శాతం వుండేదని అవి 2022 నాటికి అది 1.57 శాతానికి తగ్గిపోయింది అని తెలిపారు.