సీఎం రేవంత్ రెడ్డికి సవాలు చేసి.. తన రాజీనామా పత్రంతో అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్తూపం వద్దకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు వెళ్ళారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే నా సవాలను స్వీకరించాలి. తను రావడానికి మొహమాటంగా ఉంటే తన పిఏతో అయినా స్టాఫ్‌తో అయినా రాజీనామా లేఖను పంపించాలి అని అన్నారు.
జర్నలిస్టుల సాక్షిగా లేదా మేధావుల చేతిలో రాజీనామా లేఖను పెడుతున్నా. ఆగస్టు 15 లోగా ఏకకాలంలో రుణమాఫీతో పాటు.. ఆరు గ్యారెంటీలు, 13 హామీలు అమలు చేయాలి.. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల పేరుతో ఇప్పటికే మోసం చేసింది… డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చి కాంగ్రెస్ మాట తప్పింది. సోనియమ్మ మాట అంటూ రేవంత్ రెడ్డి ప్రజలను ఎన్నికల్లో హామీ ఇచ్చి మోసం చేశారు అని దుయ్యబట్టారు.
రైతుల కోసం నా రాజీనామా.. నా ఒక్క ఎమ్మెల్యే పదవి గొప్ప కాదు.. రైతుల కోసం నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. రేవంత్ రెడ్డి తను ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి.. సోనియా గాంధీ పేరుతో తెలంగాణ ప్రజలను రేవంత్ రెడ్డి తప్పుదోవ పట్టించారు అని హరీష్ విమర్శించారు.