mt_logo

కేసీఆర్ ప్రధాని కావాలి, కేటీఆర్ సీఎం కావాలి-వినూత్నరీతిలో యువకుని మొక్కులు

హైదరాబాద్, జూన్ 3: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన  సాయిరాం అనే యువకుడు  సీఎం కేసీఆర్ ప్రధాని కావాలి, కేటీఆర్ తెలంగాణ రాష్ట్రానికి సీఎం కావాలని,  తిరుపతి దేవస్థానం వద్ద కొండపై మోకాళ్ళతో నడుచుకుంటూ మొక్కులను తీర్చుకున్నాడు. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న పథకాలకు ఆకర్షితుడై, 101 మందిరాల గుళ్ళు గోపురాలు దర్శనానికి బయలుదేరాడు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం తిరుమల తిరుపతి దేవస్థానం కొండపైకి కాలినడకన మోకాళ్లపై మెట్ల‌పైన నడుచుకుంటూ వెళ్లి దర్శనం చేసుకున్నాడు. తన మొక్కు నెరవేరితే 1001 దేవుళ్ళ దర్శనం చేసుకుంటానని మొక్కుకున్నట్లు చెప్పాడు. కేసీఆర్ ఫ్లెక్సీతో తిరుమల తిరుపతి దేవస్థానంలో అందరిని ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ గ్రూపులో వైరల్ గా మారింది.