mt_logo

రైతులు ఈ దిశగా ఆలోచించండి : ఎర్రబెల్లి దయాకర్ రావు

హైదరాబాద్, జున్ 3 :  తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈ రోజు రైతు దినోత్సవం సందర్భంగా ఎనుమాముల మార్కెట్లో ఏర్పాటు చేసిన  కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు.. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. గతంలో నిత్యం కరెంటు కోతలతో మోటర్లు కాలిపోయేవి, ఐదు గంటల కరెంటు కూడా సక్రమంగా  ఇవ్వలేని పరిస్థితి అన్నారు. గతంలో బోర్లు కూడా పడని నేలలో కాలేశ్వరం ప్రాజెక్టు వల్ల భూగర్భ జలాల పెరిగాయి, దేశం లో 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమే అని తెలియజేసారు. ఒకప్పుడు రెండు లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జిల్లాలో మూడు లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి పెరిగిందన్నారు. 

57,801 కోట్ల రూపాయల రైతుబంధు ఇప్పటివరకు ఇచ్చాం,  4,339 కోట్ల రూపాయలు రైతు బీమా ఇచ్చాం, రైతులందరూ తెలంగాణ రాకముందు ఎలా ఉంది? తెలంగాణ వచ్చిన తర్వాత పరిస్థితి  ఎలా ఉందో మీరే బేరీజు వేసుకోవాలని అన్నారు. రైతులు పండించిన ప్రతీ  గింజ కొంటున్నాము, జూన్ 15 లోపు అలాగే నవంబర్ 10 లోపు నాట్లు వేసుకుంటే… అకాల వర్షం వల్ల పంట నష్టం అవ్వదని సూచించారు. రైతులు ఈ దిశగా ఆలోచించాలి, ప్రభుత్వానికి సహకరించాలని తెలిపారు.