mt_logo

అద్భుత పర్యాటక కేంద్రంగా చరిత్రలో నిలవనున్న కరీంనగర్ రివర్ ఫ్రంట్

కరీంనగర్ జిల్లాను అభివృద్ధితో పాటు అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్ది ప్రజలకు వినోదాన్ని పంచేలా చేపడుతున్న మానేరు రివర్ ఫ్రంట్ అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా చరిత్రలో నిలువనుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.

మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మానేరు రివర్ ఫ్రంట్ వద్ద చేపట్టిన నిర్మాణం పనులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఐఎన్ఏ స్టూడియో ప్రతినిధులు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 24 టీఎంసీల మానేరు జలశయాన్ని అద్భుత పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్ది ప్రపంచస్థాయి పర్యాటకులను ఆకర్షించేలా తీగల వంతెన, మానేరు రివర్ ఫ్రంట్ పనులను చేపట్టడం జరుగుతుందని తెలిపారు. అందులో భాగంగా ఉజ్వల పార్క్ నుండి తీగల వంతెన వరకు అభివృద్ధి పనులను చేపట్టడం జరుగుతుందని తెలిపారు. లోయర్ ప్రామినేడ్, అప్పర్ ప్రామినేడ్ పనులు ఆ తర్వాత సివిల్ పనులను చేపట్టాలని సూచించారు. పర్యాటకుల్ని ఆకర్షించేలా పెడస్టల్ బ్రిడ్జి, ఈకో మొబిలి కారిడార్, తెలంగాణ సంస్కృతి, పోరాటయోధులను గురించి వివరించేలా, బతుకమ్మ గార్డెన్‌ల ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.