mt_logo

సంక్షేమం, అభివృద్ధి కొనసాగాలంటే గులాబీ జెండా ఎగరాల్సిందే 

బుధవారం (రేపు) జరగనున్న సీఎం కేసీఆర్ మెదక్ జిల్లా పర్యటన నేపథ్యంలో మంత్రి హరీశ్ రావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. మెదక్‌ సమీకృత కలెక్టరేట్‌, పోలీసు సూపరింటెండెంట్‌ కార్యాలయం, బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని సందర్శించి పోలీసు, ఆర్ అండ్ బి, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షించారు. అనంతరం బహిరంగ సభ నిర్వహించే స్థలాన్ని సందర్శించి, పెద్ద సంఖ్యలో తరలి వచ్చే ప్రజలు, పార్టీ శ్రేణుల కోసం ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్‌లో మంత్రి మాట్లాడారు.

మెదక్‌లో పదికి పది సీట్ల గెలుపు పక్కా.. 

మెదక్ వేదికగా రేపు సీఎం కేసీఆర్ గారు ప్రగతి శంఖారావం పూరిస్తారు. అభ్యర్థుల ప్రకటన తర్వాత మొదటి సభ నూతన ఉత్సాహంతో జరుగుతుంది. కేసీఆర్ వ్యూహం ఎవరూ ఊహించలేదు. సీట్ల ప్రకటనతో విపక్షాలు కకావికలం అవుతున్నాయి. మెదక్‌లో పదికి పది సీట్ల గెలుపు పక్కా. సీఎం కేసీఆర్ గారికి గెలుపు బహుమతిగా ఇస్తాం. మెదక్‌లో పదికి పది సీట్ల గెలుపు పక్కా. సీఎం కేసీఆర్ గారికి గెలుపు బహుమతిగా ఇస్తామన్నారు. 16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉన్నా, ఆదుకున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. టేకేదార్లకు కూడా పింఛన్లు ఇచ్చే కార్యక్రమం సీఎం కేసీఆర్ మెదక్ వేదికగా ప్రారంభిస్తారని తెలిపారు.  

ఏ రాజకీయ పార్టీ కూడా ఓకే సారి ఇంత పెద్ద మొత్తంలో సీట్లు ప్రకటించలే.. 

రేపు సీఎం దివ్యాంగులకు పెంచిన రూ.4016 పింఛన్లు కూడా అందిస్తారు. తర్వాత జిల్లా కలెక్టరేట్ లో అధికారులతో మాట్లాడుతారని తెలిపారు. 3 గంటల సమయంలో సభకు హాజరు అవుతారు. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపే సభ ఇది. బీఆర్ఎస్ పాలనలో మెదక్ రూపు రేఖలు మారాయి. ఏ రాజకీయ పార్టీ కూడా ఓకే సారి ఇంత పెద్ద మొత్తంలో సీట్లు ప్రకటించలేదు. కేడర్ అంతా ఉత్సవాలు జరుగుతున్నాయి అని హరీష్ రావు అన్నారు.

కాంగ్రెస్ వాళ్లు లీడర్లు లేరు, బీజేపీ వాళ్ళు కేడర్ లేదు.  యువత, విద్యార్థులు అన్ని వర్గాల ప్రజలు బీఆర్ఎస్‌కు పెద్ద ఎత్తున జై కొడుతున్నారు. సంక్షేమం అభివృద్ధి కొనసాగాలంటే గులాబీ జెండా ఎగరాల్సిందే. దేశం మెచ్చే విధంగా కేసీఆర్ పాలన ఉంది. తెలంగాణ పథకాలను బీజేపీ కాపీ కొట్టి దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నది. కుల వృత్తులకు లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించే పథకాన్ని కూడా కేంద్రం కాపీ కొట్టింది. మనం గుర్తు ఉచితంగా లక్ష రూపాయలు అందిస్తే, కేంద్రం లోన్ల రూపంలో ఇస్తుందట. బీఆర్ఎస్‌కు, బీజేపీకి ఉన్న తేడా ఇదే..  అంతకుముందే అధికారులతో కలిసి సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు.