mt_logo

75 సీట్లు గెలవనున్న బీఆర్ఎస్… తెలంగాణ ఎన్నికలపై జనతా కా మూడ్ సంస్థ సర్వే

ప్రముఖ భారతీయ పొలిటికల్ కన్సల్టెన్సీ సంస్థ జనతా కా మూడ్ తమ ‘తెలంగాణ 2023 ఎన్నికల సర్వే’ని బుధవారం ఢిల్లీలో విడుదల చేసింది. ఇప్పటికే మిషన్‌ చాణక్య, ఎన్‌పీఐ, ఇండియా టీవీ, ఈఎన్‌ టీవీ, రాజనీతి సంస్థ వంటి సర్వేలు తేల్చడం తెలిసిన విషయమే.. నేడు జనతా కా మూడ్ సంస్థ సర్వే ప్రకారం బీఆర్ఎస్‌దే విజయమని తేల్చి చెప్పింది. దీని ప్రకారం బీఆర్ఎస్ : 72-75 సీట్లు, కాంగ్రెస్ : 31-36, బీజేపీ : 6-7, ఎంఐఎం : 4-6 సీట్లు వస్తాయని తెలిపింది. బీఆర్ఎస్ : 41% ఓట్ల షేర్, కాంగ్రెస్ : 34%, బీజేపీ : 14%, ఎంఐఎం : 3% ఓట్ షేర్ ఉంటుందని సంస్థ తెలిపింది. ఒక లక్షా ఇరవై వేలు వరకు శాంపిల్ సైజ్ తీసుకున్నట్లు ఆ సంస్థ యాజమాన్యం తెలిపింది.