mt_logo

డబ్బాలో రాళ్ళు వేసి కొడుతున్న కాంగ్రెస్: మంత్రి హరీశ్ రావు

ఎల్బీనగర్‌లో మంత్రి హరీశ్ రావు సమక్షంలో కాంగ్రెస్ నేత ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, ప్రసన్న లక్ష్మి దంపతులు, ఇతర నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ మంత్రి హరీశ్ రావు.. మీడియాతో మాట్లాడుతూ.. రామ్మోహన్ గౌడ్ ఉద్యమకారుడు. కలిసి పని చేశాడు.  సహచరుడినీ కాపాడుకోవాలి అని వచ్చామని తెలిపారు.  కష్టకాలంలో పార్టీ కోసం పని చేశాడు. ముక్కు సూటి తత్వం ఉన్న మనిషి అని అన్నారు.  రెండు సార్లు టికెట్ ఇచ్చాం. స్వల్ప మెజార్టీతో ఓడిపోయారని గుర్తు చేసారు.  11 మంది కార్పొరేటర్లు గెలిపించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేసేందుకు తోడ్పాటు అందించారని గుర్తు చేసారు. 

కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి టికెట్ ఆశించి భంగపడ్డారు. రామ్మోహన్ గౌడ్‌కు బీఆర్ఎస్ పార్టీ తగిన ప్రాధాన్యమిస్తుంది. ఆయన వెంట వచ్చే కార్యకర్తలకు తగిన అవకాశాలు ఉంటాయి. పార్టీ ప్రతినిధిగా నేను ఇక్కడికి వచ్చాను. అందుకు నేను బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. మన ఇంటి సమస్య మనం పరిష్కరించుకుందమని సూచించారు. కాంగ్రెస్ గెలిచేది లేదు. డబ్బాలో రాళ్ళు వేసి కొడుతున్నారని ఎద్దేవా చేసారు. అన్ని సర్వేలు బీఆర్ఎస్ గెలుపు ఖాయం అంటున్నాయని స్పష్టం చేసారు.  హైకమాండ్ ఢిల్లీలో ఉండే పార్టీ కావాలా, గల్లీలో ప్రజల మధ్య ఉండే పార్టీ కావాలా ప్రజలు ఆలోచిస్తున్నారని మంత్రి ప్రసంగించారు.