mt_logo

కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలె వాళ్ళకి గడ్డపారలు అవుతాయి: హరీష్ రావు

జహీరాబాద్, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాల ప్రజా అశీర్వాద సభలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. వద్దురో నాయన కాంగ్రెస్ పాలన అంటున్నారు. కేసీఆర్ ఉండగా మిషన్ భగీరథ ద్వారా రోజు నల్లా నీళ్ళు.. ఇప్పుడు నీటి కొరత. వంద రోజుల్లో హామీలు అమలు అన్నారు.. ఆరు గ్యారెంటీలు అన్నారు.. మాట తప్పుతున్నారు అని విమర్శించారు.

బాండ్ పేపర్ అన్నారు మాట తప్పారు.. అప్పుడు చేతులు ఎత్తి మొక్కారు.. మీరు ఇచ్చిన గ్యారెంటీలె గడ్డపారలు అవుతాయి. రుణమాఫీ మాట తప్పారు… బోనస్ బొంద పెట్టారు.. రైతు బంధు ఇస్తా అని మాట తప్పిండు.. మొదటి హామీకే మంగళం పాడిండు అని దుయ్యబట్టారు.

మహాలక్ష్మి ఇవ్వక కోటి 42 లక్షల మందికి కాంగ్రెస్ మోసం చేసింది. ఓటు అడగడానికి వస్తె చెప్పు చీపుళ్లు పట్టాలి..తులం బంగారం ఇస్తా అని మోసం చేశారు..కాంగ్రెస్ పార్టీని బొంద పెడితే ఇవన్నీ వస్తాయి.. కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించాలి అని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ ఓడిపోతే ప్రభుత్వం పడిపోదు.. కానీ వారికి సురుకు తగులుతుంది. రూ. 4,000 పింఛన్ ఏమైంది.. అన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలి. తెలంగాణ ప్రజలు బీజేపీ, కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి.. రెండు పార్టీలు దొందూ దొందే అని పేర్కొన్నారు

జహీరాబాద్, మెదక్ ఎంపీలుగా బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని హరీష్ కోరారు