mt_logo

ఎస్‌డీఆర్ఎఫ్ నిధులు వినియోగించుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్: హరీష్ రావు

ఎస్‌డీఆర్ఎఫ్ నిధులు వినియోగించి వరద బాధితులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం చెందిందని మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. విపత్తు నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి విఫలమైందని తేటతెల్లం అయిందని దుయ్యబట్టారు.

వరద ప్రభావంపై ఇప్పటివరకు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం స్టేటస్ రిపోర్ట్ ఇవ్వలేదని.. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ లేఖతో ఈ విషయం బట్టబయలైందని ఆరోపించారు.

ప్రభుత్వ ఖాతాలో ఉన్న రూ. 1345.15 కోట్ల ఎస్‌డీఆర్ఎఫ్ నిధులను వినియోగించకుండా కాంగ్రెస్ ప్రభ్యవం మౌనంగా ఉందని.. కాంగ్రెస్ నిర్లక్ష్య వైఖరితో విపత్తు నిర్వహణకు నిధులు ఉన్నప్పటికీ అవి నిరుపయోగంగా మారాయి అని విమర్శించారు.

ఈ ఏడాదికి సంబంధించి రూ. 208 కోట్ల ఎస్‌డీఆర్ఎఫ్ నిధులు రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలోకి జూన్ నెలలోనే జమ అయ్యాయి. ఈ నిధులను సైతం వినియోగించుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది అని హరీష్ రావు పేర్కొన్నారు.

కేంద్రానికి యుటిలైజేషన్ లెటర్ ఇచ్చే సోయి లేకపోవడమే దీనికి కారణమని.. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం రాష్ట్ర ప్రజలకు శాపంగా మారిందని మండిపడ్డారు. కాంగ్రెస్ అవగాహనరాహిత్యం, నిర్లక్ష్యపు పోకడతో రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.