సీఎంఆర్ఎఫ్ చెక్కుల విషయంలో వస్తున్న ఆరోపణలను మాజీ మంత్రి హరీష్ రావు కార్యాలయం ఖండించింది. వారు ఇచ్చిన వివరణ ప్రకారం చెక్కుల విషయంలో ఆరోపణలు ఎదురకొంటున్న నరేష్ అనే వ్యక్తి హరీశ్ రావు వద్ద పీఏ కాదు.. అతను ఒక కంప్యూటర్ ఆపరేటర్‌గా, తాత్కాలిక ఉద్యోగిగా హరీశ్ రావు కార్యాలయంలో పనిచేసే వారు అని కార్యాలయం వివరణ ఇచ్చింది.
ఈ విషయంలో హరీష్ రావు కార్యాలయం వారు ఇచ్చిన పూర్తి వివరణ 👇
వాస్తవం ఏమిటంటే నరేష్ అనే వ్యక్తి హరీశ్ రావు వద్ద పీఏ కాదు. అతను ఒక కంప్యూటర్ ఆపరేటర్‌గా, తాత్కాలిక ఉద్యోగిగా హరీశ్ రావు కార్యాలయంలో పనిచేసే వారు
ఆర్థిక, ఆరోగ్య మంత్రిగా పదవీకాలం పూర్తయిన తర్వాత, ప్రభుత్వ ఆదేశాలు లేఖ నం. 2290 తేదీ 05-12-2023 ఆదేశాల ప్రకారం, మంత్రి గారి ఆఫీసు మరుసటి రోజు 06-12-2023 రోజున మూసివేసి, సిబ్బందిని పంపియ్యడం జరిగింది. ఆ రోజు నుంచి నరేష్ అనే వ్యక్తితో హరీశ్ రావు కార్యాలయానికి ఎలాంటి సంబంధం లేదు
అయితే ఆఫీసు మూసివేసే క్రమంలో ఎలాంటి సమాచారం లేకుండా కొన్ని సీఎంఆర్ఎఫ్ చెక్కులను తన వెంట తీసుకువెళ్లినట్లు మా దృష్టికి వచ్చింది.
దీనిపై వెంటనే మా కార్యాలయం స్పందించి, నరేష్ అనే వ్యక్తిపై 17-12-2023 నాడు, నార్సింగి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం జరిగింది.. చట్ట ప్రకారం, తగు చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది
కాబట్టి, ఆ వ్యక్తితో హరీశ్ రావు గారికి కానీ, కార్యాలయానికి గాని ఎలాంటి సంబంధం లేదు. ఈ వాస్తవాలు గుర్తించకుండా తప్పుడు ప్రచారం జరుగుతున్నది
ఒక వ్యక్తి చేసిన తప్పును, మొత్తం కార్యాలయానికి వర్తింపచేయడం బాధాకరం. ఎంతో మంది అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేదలకు మా కార్యాలయం సీఎంఆర్ఎఫ్ చెక్కులు కాకుండా, ఎన్నో విధాలుగా సహాయం పడింది. వాస్తవాలు గుర్తించాలని కోరుతున్నాం.