mt_logo

ధరణి వద్దంటే అవినీతే రాజ్యమేలుతుంది: సీఎం కేసీఆర్

నిర్మల్: ఎవరైతే ధరణిని బంగాళాఖాతంలో ఏయమన్నరో వాళ్లని బంగాళాఖాతంలో యిసిరికొట్టాలె…  ఎవరైతే మల్లా వీఆర్వోలను, పట్వారీలను మల్ల మనల్ని పరేషాన్ చేయడానికి, మన భూములు గోల్ మాల్ చేయడానికి..ఎవలైతే మల్ల దుర్మార్గం చేస్తున్నరో, ఇంత బాహాటంగా చెబుతున్నరో.. ఇండియా మొత్తంలో ఎక్కడా లేదని, నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్ అన్నారు. నిర్మల్ జిల్లా ఏర్పాటు చేసుకున్న తర్వాత బ్రహ్మాండంగా నిర్మల్ కలెక్టరేట్ నిర్మాణం చేసుకున్నామన్నారు.  కాంగ్రెస్ పార్టీ నాయకులు ధరణి పోర్టల్ తీసేసి బంగాళాఖాతంలో ఇస్తామంటున్నారు, అంటే మల్ల పైరవీకారులు రావాలె.. మల్ల వీఆర్వోలు రావాలె అదే వారి ఉద్యేశ్యం అన్నారు. 

ఇవ్వాల రైతుబంధు వస్తోంది..మీరొక ఆలోచన చేయాలె. రైతు బంధు ఏ విధంగా వస్తది. రైతు బంధు హైదరాబాద్ లో ప్రభుత్వం బ్యాంకులో వేస్తే ఇక్కడ బ్యాంకు నుంచి మీకు టింగు టింగుమని మెస్సేజీలొచ్చి ఇయ్యాల రైతు బంధు వస్తా ఉందని తెలిపారు. ఎవలైనా రైతు చనిపోతే ఏ విధంగా రైతు బీమా వస్తా ఉంది?. మీరెవరు కూడా మాట్లాడకుండా..ఒక దరఖాస్తు పెట్టకుండా ఏ ఆఫీసుకు పోయే అవసరం లేకుండా 8 రోజుల్లోపల్నే రూ.5 లక్షల చెక్కు వాళ్ల ఇంటికి వస్తా ఉంది. నేను ఈ మధ్య మహారాష్ట్ర పోతే ఎట్లా సాధ్యమైతది సర్..డబ్బులు బ్యాంకులో ఎట్లేస్తరు.. కొన్న డబ్బులు కూడా బ్యాంకులేస్తరా..సచ్చిపోతే కూడా బ్యాంకులేస్తరా.. రైతు బంధు కూడా క్రమం తప్పకుండా బ్యాంకులకొస్తదని వాళ్లు ఆశ్చర్యపడతావున్నరు. 

దుర్మార్గులు 50 ఏండ్లు దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలించి మంచినీళ్లు కూడా ఇయ్యలే

కానీ ఇక్కడ వున్నటువంటి దుర్మార్గులు..మళ్లీ పాత పరిపాలన, కాంగ్రెస్ పరిపాలన మనం చూడలేదా?  ఆనాడు వీఆర్వోల దోపిడీ, పహాణీలు మార్చేయడం, భూమి రికార్డులు మార్చేయడం. ఇయ్యాల రిజిస్ట్రేషన్ కావాలంటే పదిహేను నిమిషాలల్లో అయిపోతావుందని అని సూచించారు. తర్వాత పట్టా కావాల్నంటే పది నిమిషాల్లో అయిపోతావుంది. ధరణి తీసేస్తే మల్ల ఎన్ని రోజులు తిరగాలి..ఎన్ని దరఖాస్తులు పెట్టాలె? అని ప్రశ్నించారు.  ఈ దుర్మార్గులు 50 ఏండ్లు దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలించి మంచినీళ్లు కూడా ఇయ్యలే మనకు.

ఇయ్యాల ప్రతి ఇంట్లో నల్లా ఫిట్ చేసి బ్రహ్మండంగా గోదావరి నుంచి నీళ్లు తెచ్చుకుంటా వున్నమని,  ఎస్సారెస్పీ ఎండిపోకుండా శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకాన్ని పెట్టుకున్నాం. కోట్ల టన్నుల వడ్లు పండించుకుంటా వున్నం. బ్రహ్మాండంగా రైతులందరూ కూడా నిలబడి ఇయ్యాల ధైర్యంగా ముందుకుపోయే పరిస్థితి తెచ్చుకున్నామని గుర్తు చేసారు. 

ట్రాన్స్ జెండర్లను, ఒంటరి మహిళలను .అందర్ని ఆదుకుంతున్నాం.. 

ఈ రాష్ట్రం ఇట్లాగే ఉండాల్నంటే ఖచ్ఛితంగా మీ అందరి మద్ధతు, మీ అందరి ఆశీస్సులు బీఆర్ఎస్ పార్టీకి కావాలె. తప్పకుండా మీ అందరి మద్ధతుతోని మరింత ముందుకు పోవల్సిన అవసరం ఉందని అన్నారు. రాబోయే టర్మ్ లో.. ఎన్నికలైపోయిన తర్వాత ఇయ్యాల ఉన్న పద్ధతి కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ.. అంటే ధాన్యాన్ని ప్రాసెస్ చేసి అంటే రైతుకు ఇంక ఎక్కువ డబ్బులొచ్చేటట్లు మార్కెట్ కు పంపేవిధంగా కొత్త ప్రణాళికలు ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉందని తెలిపారు. అనేక మంచి కార్యక్రమాలు మనం తీసుకున్నాం. పేదవాళ్లను కావొచ్చు..వృద్ధులను కావొచ్చు.. ట్రాన్స్ జెండర్లను కావొచ్చు..ఒంటరి మహిళలను కావొచ్చు..అందర్ని కూడా ఆదుకుంటా వున్నం. దేశంలోనే ఈరోజు పర్ క్యాపిటా ఇన్ కం లో తలమానికంగా అగ్రభాగాన ఉన్నది తెలంగాణ, విద్యుత్ లో..ఒకనాడు కరెంట్ ఎప్పుడు వస్తదో తెల్వదు.. ఎప్పడు పోతదో తెల్వదు..చాలా భయంకరమైన పరిస్థితులుండేదని అన్నారు. 

మహారాష్ట్ర ప్రజలు కేసీఆర్ మాకు నువ్వు రావాలని కోరారు 

ఈరోజు మనం ఎంత మంచిగున్నం అని అడిగారు.  మహారాష్ట్ర అంత పెద్ద రాష్ట్రమైనా వాళ్లకంటే వాళ్ల తనదన్ని మనం బ్రహ్మాండంగా వున్నం, ఇయ్యాల మహారాష్ట్రకు  నేను బోతే..కేసీఆర్ మాకు నువ్వు రావాలె..అబ్ కి బార్..కిసాన్ సర్కార్..అని బ్రహ్మాండంగా స్వాగతం పలుకుతావున్నరు. ఇక్కడ అడ్డం పొడుగు మాట్లాడేటటువంటి ప్రతిపక్షాలు..ఒక పద్ధతీపాడూ లేకుండా ఎటుబడితే అటూ ఆగమాగం చేయడానికి మల్లా వస్తున్నరని చెప్పారు. అధికారం నుంచి దూరమైండ్రు కాబట్టి మల్లా అధికారం వస్తే మింగుదామనే ఆలోచనలో ఉన్నరు. తస్మాత్ జాగ్రత్త అని నేను ప్రజలందరినీ హెచ్చరించారు.