mt_logo

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు 

 మెదక్, జూన్ 5: మెదక్ నియోజకవర్గం పాపన్నపేట మండలం రామతీర్థం గ్రామంలో నూతనంగా నిర్మించిన 56 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై లబ్ధిదారులకు గృహ పత్రాలు అందించిన రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనే సామెత ఊరికినే రాలేదు. ఎంతో కష్టం ఎంతో ప్రయాసపడితే తప్ప ఇల్లు కట్టలేము. అలాంటిది ఒక రూపాయి ఖర్చు కాకుండా చెమట చుక్క చిందించకుండా మీకు అన్ని సౌకర్యాలతో ఇల్లు కట్టి ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వమన్నారు. పైరవీకారుల పని లేకుండా నిజమైన లబ్ధిదారులకు ఇల్లు అందేలాగా కలెక్టర్ చేతనే ఇళ్ల మంజూరు చేయించామని తెలిపారు. ఈ నెలాఖరిలోగా ఇంటి జాగా ఉన్న వారికి గృహలక్ష్మి పథకం ద్వారా ఇల్లు కట్టుకొనేందుకు ఆర్థిక సాయం అందిస్తాం అన్నారు. 

కాంగ్రెస్ పాలన అంటే నీళ్లకు కష్టం కరెంట్ కు కష్టం పెన్షన్ కి కష్టం

కేంద్ర బీజేపీ బోరు బాయికాడ మీటర్ పెట్టి రైతులకు బిల్లు పంపించాలని తెలంగాణపై ఒత్తిడి తెచ్చింది, రైతుపై ఇక్కడ మీటర్ పెట్టనందుకు 30 వేల కోట్లను బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఆపిందన్నారు.నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మీటర్ పెట్టేది లేదని తేల్చి చెప్పిన గొప్ప నాయకుడు కేసీఆర్, కాంగ్రెస్ పాలన తెస్తామని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. కాంగ్రెస్ పాలన అంటే ఏంటిది మీరు మర్చిపోయారా అని ప్రశ్నించారు.  కాంగ్రెస్ పాలన అంటే నీళ్లకు కష్టం కరెంట్ కు కష్టం పెన్షన్ కి కష్టం ని గుర్తు చేసారు. ఇంత మంచిగా రైతులను ప్రేమించినట్టు ఇంకే ముఖ్యమంత్రి అయిన ప్రేమించగలుగుతాడా. ఎంత కష్టమైనా గింజ పోకుండా వడ్లను మన కేసీఆరే కొన్నాడు ఢిల్లీ ప్రభుత్వం కొన అన్నా కేసీఆర్ ముందుండి కొన్నాడని గుర్తు చేసారు. 

ఈనెల 14 తేదీన న్యూట్రిషన్ కిట్టు ప్రారంభం 

కరోనా వచ్చినా,పెద్ద నోట్ల రద్దు కష్టమొచ్చినా రైతులకు కష్టం లేకుండా చూసుకున్నాడు మన కేసీఆర్.మెదక్ నియోజకవర్గం లో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మించాము. ఆరోగ్య సమస్యలు వస్తే హైదరాబాద్ కు పోయే అవసరం లేకుండా మీ వద్దకే వైద్య సేవలు  తెచ్చామని తెలిపారు. ఈనెల 14 తేదీన న్యూట్రిషన్ కిట్టు ప్రారంభించబోతున్నాం, గర్భిణీల ఆరోగ్యం కోసం న్యూట్రిషన్ కిట్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కేసీఆర్ అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నారు,  బిడ్డ పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి, బిడ్డ గర్భం దాలిస్తే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్టు, ఆడ బిడ్డ పురుడు పోస్తే కేసీఆర్ కిట్టు, ముసలోళ్లకు ఆసరా పెన్షన్, రైతుకు రైతుబంధు ఇలా అన్ని వర్గాలను ఆదుకుంటున్న నాయకుడు కేసీఆర్ అని గుర్తు చేసారు.