mt_logo

తక్షణమే తెలంగాణ విద్యార్థులను రప్పించండి… ఖర్చులు మేము భరిస్తాం : మంత్రి కేటీఆర్

ఉక్రెయిన్‌లోని తెలంగాణ విద్యార్థుల‌ను ఆదుకునేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఢిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్‌, రాష్ట్ర సచివాల‌యంలో హెల్ప్ లైన్ నంబ‌ర్ల‌ను ఏర్పాటు చేసింది. దీనితోపాటు ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థుల‌ను ఆదుకోవాల‌ని కోరుతూ విదేశాంగ శాఖ మంత్రి జైశంక‌ర్‌కు రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. విద్యార్థుల‌ను స్వ‌దేశానికి ర‌ప్పించేందుకు ప్ర‌త్యేక విమానాల‌ను ఏర్పాటు చేయాల‌ని కేంద్రాన్ని కోరుతూ… విద్యార్థుల పూర్తి ప్ర‌యాణ ఖ‌ర్చుల‌ను భ‌రించ‌డానికి తెలంగాణ‌ ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. ఇక హెల్ప్ లైన్స్ ఏర్పాటు చేయడంతోపాటు ఎప్ప‌టిక‌ప్పుడు విదేశాంగ శాఖ అధికారుల‌తో తెలంగాణ రాష్ట్ర సీఎస్ సోమేశ్ కుమార్ సంప్ర‌దింపులు జ‌రుపుతున్నారు. గురువారం రాత్రి హెల్ప్ లైన్ సెంట‌ర్లు ఏర్పాటు చేయగా, ఇప్ప‌టి వ‌ర‌కు 75 ఫోన్ కాల్స్ వ‌చ్చిన‌ట్లు తెలుపుతూ, విద్యార్థుల‌కు అవ‌స‌ర‌మైన భ‌రోసా ఇస్తున్నామ‌ని అన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్ హెల్ప్ లైన్ నంబ‌ర్ – 70425 66955, 99493 51270, 96456 63661.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *