mt_logo

నా మీద జరిగిన దాడి ప్రపంచంలో ఏ నాయకుని మీద కూడా జరిగి ఉండదు: సీఎం కేసీఆర్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు రోజైన జూన్ 22 (గురువారం)న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ‘తెలంగాణ అమరవీరుల స్మారకం’ ను ప్రారంభించారు. ఒకవైపు సచివాలయం మరో వైపు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 125 ఫీట్ల విగ్రహం పక్కనే అమర జ్యోతి వెలుగులో సీఎం కేసీఆర్ మాట్లాడారు. 

మహాత్మాగాంధీ స్ఫూర్తితో.. 

ఎన్నిసార్లు మేం పదవులకు రాజీనామా చేసినమో లెక్కే లేదు. మంత్రి పదవులు, డిప్యూటీ స్పీకర్ పదవులు, ఎమ్మెల్యే పదవులు, కేంద్ర మంత్రి పదవులు, పార్లమెంటు సభ్యుల పదవులు లెక్కలేకుండా రాజీనామాలు చేసినం. తెలంగాణ సమాజం మీద, ప్రజల మీద మాకు నమ్మకం అందుకే రాజీనామాలు చేసేందుకు వెనుకాడం అని చెప్పాం. రాజీనామాలను కూడా అస్త్రాలుగా వాడి, కొత్త వ్యూహాలతో ముందుకు పోయాం. మహాత్మాగాంధీ ఇచ్చిన స్ఫూర్తితోనే అహింసాయుతంగా ముందుకు సాగాం. 

ఈ తిట్లే దీవెనలుగా..  

మిత్రుడు దేశపతి శ్రీనివాస్ చెప్పినట్లు మాకు దేవుడిచ్చిన శక్తినంతా కూడగట్టుకొని హింస జరగకుండా చూశాం. నా మీద సమైక్య వాదులు, తెలంగాణలో ఉండే సమైక్యవాదుల తొత్తులు నా మీద చేసిన దాడి ప్రపంచంలో ఏ నాయకుని మీద కూడా జరిగి ఉండదు. అయినా కూడా నేను ఏనాడు బాధ పడలేదు. నా ప్రజల కోసం నేను పాటుపడుతున్న కాబట్టీ ఈ తిట్లే దీవెనలు అనుకుంటా అనుకున్నాను గానీ వీటి గురించి బాధపడలేదని సీఎం చెప్పారు.