mt_logo

వలసల వనపర్తిని వరి పంటల వనపర్తిని చేసిందెవరు: సీఎం కేసీఆర్

వలసల వనపర్తిని వరి పంటల వనపర్తిని చేసిన మొనగాడెవ్వడు? అని  సీఎం కేసీఆర్ అడిగారు. ప్రజా ఆశీర్వాద సభల్లో భాగంగా సీఎం వనపర్తి, పాల్గొని మాట్లాడుతూ.. మల్లా ఎన్నికలు వచ్చినయి.  పది సంవత్సరాల్లో ఏం జరిగింది  అదంతా నిలువెత్తుగా మీ కండ్ల ముందు ఉందని అన్నారు.  నిజనిజాలపై  చర్చ మీ గ్రామాల్లో  జరుగాలన్నారు. 

కొడంగల్ రా అని ఒకడు, గాంధీ బొమ్మకాడికి రా అని ఒకడు

24 ఏండ్ల పొద్దయింది. తెలంగాణ కోసం బయలు దేరి, 24 ఏండ్ల నాడు ఎవ్వడు లేడని మండిపడ్డారు. పిడికెడు మంది ఉన్నరు. అందులో నిరంజన్ రెడ్డి కూడా ఒక్కడు, ఎవ్వలు లేని నాడు ఉద్యమాన్ని ప్రారంభించినమన్నారు. ఈ రోజు విమర్శలు చేసే వాళ్లు ఎవ్వడు ఏ చెట్టుకింద ఉన్నడో మీ అందరికి తెలుసు. ఎవ్వడి బూట్లు మోసుకుంటున్నడో మీకు తెలుసు అని గుర్తు చేశారు.  కేసీఆర్ నీకు దమ్ముందా?  కొడంగల్ రా అని ఒకడు, గాంధీ బొమ్మకాడికి రా అని ఒకడు .. 

కేసీఆర్ శవయాత్ర నా..తెలంగాణ జైత్రయాత్రనా.. 

119 నియోజకవర్గాల్లో కేసీఆర్లు ఉన్నరు కదా. ఇదేంది వనపర్తి కేసీఆర్ నా పక్కన్నే నిలబడి ఉన్నడు కదా? అడిగారు. నేను చావునోట్లో తలకాయపెట్టి కేసీఆర్ శవయాత్ర నా..తెలంగాణ జైత్రయాత్రనా అని నినాదమిచ్చిఆమరణ నిరాహార దీక్ష చేస్తే తప్ప తెలంగాణ రాలేదు. పెండింగ్ ప్రాజెక్టు అని పడావు పెడితే నీళ్లు రాలే. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం తెస్తే లక్ష ఎకరాలకు నీళ్లు వస్తున్నాయని తెలిపారు. వలసల వనపర్తిని వరి పంటల వనపర్తిని చేసిన మొనగాడెవ్వడు.

తెలంగాణను ఒక పూల పొదరిల్లులాగా

ఉల్టా పల్టా మాటలు మాట్లాడే చిల్లరగాళ్లెవ్వరు.ఎవడైనా గంజి కేంద్రం పెడితే గుంజికొట్టే పరిస్థితులకు వచ్చాం.. శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి అద్భుతమైన మంత్రులు. వీరికన్నా దొడ్డుకున్నోళ్లు, ఎత్తుకున్నోళ్లు పాలించిండ్లు. ఒక్కడన్నా మెడికల్ కాలేజీలు తెచ్చిండా . మహబూబ్ నగర్ లో ఐదు మెడికల్ కాలేజీలు తెచ్చిన ఘనులు మా మంత్రులని పేర్కొన్నారు.  పశువైద్య కళాశాల కావాలని నిరంజన్ రెడ్డి అడుగుతున్నారు. ముస్లీంలను ఓటు బ్యాంకు వాడుకున్నది కాంగ్రెస్ అని తేల్చి చెప్పారు. తెలంగాణను ఒక పూల పొదరిల్లులాగా చేసుకుంటున్నాం అన్నారు. 

దళిత బంధు అనే పదాన్ని పుట్టించిందే కేసీఆర్

కొత్తకుండలా ఈగ చొచ్చినట్లు. సంసారం చదురుకున్నట్లు శ్రద్ధతో, పద్ధతితో తెలంగాణను అభివృద్ధి చేసుకున్నామన్నారు. దళిత సమాజం ఆలోచించాలి. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు దళితుల గురించి ఆలోచించలేదు. ఓటు బ్యాంకు మాదిరిగా వాడుకున్నారు. దళిత బంధువును  నెహ్రూ కాలంలోనే అమలు చేసి ఉంటే దళితుల పరిస్థితి మెరుగ్గా ఉండేది. భారత దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి నోట్ల నుంచి రాలేదు. దళిత బంధు అనే పదాన్ని పుట్టించిందే కేసీఆర్ అని అన్నారు. నిరంజన్ రెడ్డి కోరిన అభివృద్ధి పనులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. గొప్ప పట్టణంగా వనపర్తి వెలుగొందుతది, నిరంజన్ రెడ్డిని ఆలోచించాలి. బ్రహ్మండమైన మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వాల్మీకి సోదరుల గురించి తీర్మానం చేశామన్నారు. మోడీ ప్రభుత్వం మొద్దు ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. వారి హక్కుల కోసం బీఆర్ఎస్ పార్టీ చిత్తశుద్ధితో ఉందని చెప్పారు.