mt_logo

చిప్పకూడు తిన్న రేవంత్‌కి సిగ్గురాలేదు: సీఎం కేసీఆర్

రాష్ట్రాన్ని అస్థిర పరచడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనడానికి నగదు రూ. 50 లక్షలు ఇచ్చుకుంటూ దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అని సీఎం కేసీఆర్ విరుచుకుపడ్డారు. చిప్పకూడు తిన్న రేవంత్‌కి సిగ్గురాలేదని చురకలంటించారు. కొడంగల్ ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత సీఎం మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి చెప్తుండు.. కరెంటు వేస్టుగా కేసీఆర్  24 గంటలు ఇస్తున్నడు.. 24 గంటలు అవసరం లేదు. మూడు గంటలే చాలు అంటున్నడు. మరి మూడు గంటల కరెంటే సరిపోతుందా? అని అడిగారు. 24 గంటలుండాలి కదా? అంటే ప్రజలంతా ఉండాలి అని సమాధానమిచ్చారు. 24 గంటల కరెంటు ఉండాలంటే కూడా మన నరేందర్ రెడ్డి గెలవాలని అన్నారు.  

మీరే ఆలోచన చేయాలి

ప్రమాదకరమైన మాట ఏంటంటే ..  రేవంత్ రెడ్డి దే.  రేవంత్ రెడ్డి భూ కబ్జాదారు. ఎక్కడపడితే అక్కడ భూకబ్జాలు చేస్తడు. ఈ జిల్లాలోనే చాలా చేసిండని తెలియజేసారు.  కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి తీసి బంగాళ ఖాతంలో వేస్తరట. దాని స్థానంలో భూమాత పెడుతరట! అది భూమాతనా భూమేతనా? మీరు ఆలోచన చేయాలని సూచించారు. 

రేవంత్ రెడ్డి గుణం ఏంటి?

నిజాయితీతో ఆలోచించి ఓటెయ్యాలి? అని తెలిపారు. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏమయిన పని జరిగిందా? అని అడిగారు.  ఇయ్యాల నరేందర్ రెడ్డి వచ్చాక ఎంత పనిజరిగింది. ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. బస్ డిపో, డిగ్రీ కాలేజీలు, దవాఖానాలు ఏడికెళ్ళి వచ్చాయో ఆలోచించాలన్నారు.  పనిచేసే నరేందర్ రెడ్డి కావాల్నా, ఫాల్తు మాటలు మాట్లాడే రేవంత్ రెడ్డి కావాల్నా?  మీరే నిర్ణయం చేయాలి? రేవంత్ రెడ్డి గుణం ఏంటి? టిక్కెట్లు అమ్ముకున్నడని  కాంగ్రెస్ నేతలే అంటున్నాడని వివరించారు. 

నాయకులు పండవెట్టి తొక్కచ్చున్నా.. 

తెలంగాణ ఉద్యమం నాడు ఆంధ్రోళ్ల సంకల ఉండే.. తెలంగాణ ఉద్యమకారుల మీదికి తుఫాకి పట్టుకుని బయలుదేరిండు. ఎవరైనా అడ్డమస్తే కాల్చేస్తా అని. తెలంగాణ వచ్చింది.. మంచిగ నడుపుకుంటున్నం. ఏం జేసిండు రేవంత్ రెడ్డి అని ప్రశ్నించారు. ఉస్మానియా కూలీలు అడ్డాకూలీలంటుండు. జర్నలిస్టులను పండబెట్టి తొక్కుతా అంటున్నాడు. నాయకులు పండవెట్టి తొక్కచ్చున్నా అని ప్రశ్నించారు. నరేందర్ రెడ్డి ఎప్పుడైనా  ఆ మాట అన్నడా? అని అడిగారు. 

రేవంత్ నీతి లేదు. పద్ధతి లేదు

కాంగ్రెస్‌కు 20 సీట్లు కూడా రావని తేల్చి చెప్పారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితడని మీరు ఓట్లేస్తే మోసపోతారు. రేవంత్ నీతి లేదు. పద్ధతి లేదు.  రేవంత్ రెడ్డి రాజకీయాల్లో ఉండదగిన మనిషి కాదని ఆగ్రహం వ్యక్తం చేసారు. కర్ణాటకలో కాంగ్రెస్ వాళ్లు ఎంత మోసం చేసిండ్రో కర్ణాటక ప్రజలు చెప్తూనే ఉన్నారు. ధోఖా బాజ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రజల మధ్య ఉండే నరేందర్ కావాలా? ఎవరు కావాలో మీరే ఆలోచించుకోవాలని కోరారు.  పాలమూరు రంగారెడ్డి నీళ్లు కూడా మీకు తెప్పించే బాధ్యత నాదని హామీ ఇచ్చారు.