పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో మేయర్ జక్కా వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్మహించిన బీఆర్ఎస్ పార్టీ మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి పరిచయ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గ ఎమ్మెల్యే చామకూర మలారెడ్డి పాల్గొని పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి గడ్డపై గులాబీ జెండా ఎగురవేయాలని కార్పొరేటర్లు, నాయకులు, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ.. దేశంలోనే తెలంగాణను నెంబర్ వన్‌గా నిలిపిన ఘనత కేసిఆర్‌దీ.. అభివృద్ధి బీఆర్ఎస్‌తోనే సాధ్యం అయింది… మల్కాజ్‌గిరి పార్లమెంటులోని ఏడు శాసనసభ నియోజకవర్గాలలో మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్పోరేషన్ల మేయర్లు, నాయకులు ఉన్నారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్‌ను అభివృద్ధిలో నెంబర్ వన్‌గా నిలిపి దేశానికే ఆదర్శంగా నిలిపిన ఘనత మేయర్, పాలకవర్గానికే దక్కుతుందన్నారు.
మేడ్చల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది.. ప్రత్యర్థులకు కనీసం క్యాడర్ లేదు, నాయకుడు లేడు, బూత్ ఏజెంట్ కూడా లేడని ఎద్దేవా చేసారు. బీఆర్ఎస్ కార్యకర్తలు సైనికులు ఎవరికీ భయపడరు.. కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచి 100 రోజులైనా ప్రజలకు ఇచ్చిన హామీలలో నేరవేర్చించి శూన్యం.. కూల్చడంలో నెంబర్ వన్ ప్రభుత్వం కాంగ్రెస్ అని అందుకే గెలిచిన వెంటనే పేదల ఇండ్లపై బుల్డోజర్స్ ఎక్కుపెట్టిన ఘనత వారికే దక్కిందని విమర్శించారు. దేశంలోనే అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గం అయినటువంటి మల్కాజ్‌గిరి పార్లమెంట్‌కు బీఅర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న రాగిడి లక్ష్మారెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు
బీఆర్ఎస్ అభ్యర్ధి రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. నా రాజకీయ జీవితంలో అనేక సేవా కార్యక్రమాలు చేశానని నా సేవా దృక్పథం, నిబద్దతను చూసి బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ నాకు ఎంపీ ఆభ్యర్ధిగా అవకాశం కల్పించారని.. నేను ప్రజలకు సేవ చేయడానికే ముందుకు వచ్చానని.. మల్కాజ్‌గిరి ఎంపీగా భారీ మెజారిటీతో నన్ను గెలిపిస్తే నియోజకవర్గంతో పాటు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్‌ను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానన్నారు.
ప్రజలకు అందుబాటులో ఉండని అభ్యర్థులకు ఓటు వేయవద్దని, కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి కొట్లాట పెట్టే పార్టీలను అదరించవద్దు… ఢిల్లీ పార్టీలను వదిలి..తెలంగాణ ప్రజల పార్టీ బీఆర్ఎస్‌కు అండగా నిలవాలని.. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులకు పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించడానికి పార్టీ శ్రేణులు ఒక్కటిగా కృషి చేయలని పిలుపిచ్చారు.
మేయర్ జక్కా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. కేసిఆర్, కేటీఆర్, మాజీ మంత్రి మల్లారెడ్డి నాయకత్వంలో తెలంగాణను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నమన్నారు. గత పది సంవత్సరాల బీఅర్ఎస్ పరిపాలనలో ప్రజలు ఎలాంటి సమస్యలు లేకుండా ఉన్నారని తెలిపారు. బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి తన చారిటీ ట్రస్ట్ ద్వారా నిరుపేదలకు అనేక సేవలు అందిస్తున్నారని కొనియాడారు. కాబట్టి ఇలాంటి నాయకున్ని ఎన్నుకుంటే ప్రజలకు మరింత మేలు చేకూరుతుందన్నారు.
మల్కాజ్‌గిరి పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్ధి రాగిడి లక్ష్మారెడ్డికి అండగా ఉండి.. మల్కాజ్‌గిరి ఎంపీగా గెలిపిస్తే మన సమస్యలను ఢిల్లీ వరకు తీసుకుపోయి కొట్లాడుతారన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్‌లో భారీ మెజారిటీతో ఓటు వేసి గెలిపించి, కేసీఆర్, కేటీఆర్‌కి గిఫ్ట్‌గా ఇవ్వాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సుభాష్ నాయక్, మద్ది యుగేందర్ రెడ్డి, కౌడే పోచయ్య, మధుసూదన్ రెడ్డి, ఎంపల్ల అనంత రెడ్డి, దొంతిరి హరిశంకర్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు ఇర్ఫాన్, నాయకులు బైటింటి ఈశ్వర్ రెడ్డి, లేతాకుల రఘుపతి రెడ్డి, బండారి రవీందర్, బండి సతీష్ గౌడ్, చెరుకు పెంటయ్య, ఏనుగు మనోరంజన్ రెడ్డి, బండి శ్రీరాములు, జావీద్ ఖాన్, బీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు నిర్మల, యూత్ అధ్యక్షులు ప్రభు, మల్లం వెంకటేష్ గౌడ్, పింగళి జోగిరెడ్డి, శ్యామల నరసింహ, పులగుర్ల జంగారెడ్డి, మహిళలు, యువకులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.