రామగుండం నియోజకవర్గానికి చెందిన సీనియర్ బీజేపీ నాయకుడు కౌశిక్ హరి త్వరలోనే బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు శుక్రవారం ప్రగతి భవన్లో మంత్రులు కేటీఆర్, హరీష్ రావులతో భేటీ అయ్యారు. పార్టీలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. అందుకు సంబంధించిన చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రామగుండం స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఉన్నారు. కాగా..త్వరలోనే రామగుండంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి కౌశిక్ హరితో సహా పలువురు బీజేపీ సీనియర్ నాయకులు బీఆర్ఎస్ లోకి చేరనున్నారు.
కాగా… సంఘటిత అసంఘటిత కార్మిక సంఘాల నాయకులుగా రామగుండం ప్రాంతంలో ప్రజాదరణ పొందిన నేతగా కౌశిక్ హరికి ప్రజల్లో మంచి పట్టు ఉంది. 2009లో పీఆర్పీ నుంచి పోటీ చేయగా కేవలం 1200 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ప్రజల్లో పట్టు ఉన్న నేత కావడంతో కౌశిక్ హరి చేరిక ప్రాధాన్యత సంతరించుకుంది.