mt_logo

బీసీలు వెనుకబడ్డ వారు కాదు

  • బీసీలు వెనుకబడ్డ వారు కాదు గత పాలకుల నిర్లక్ష్యంతో వెనుకకు నెట్టేయబడ్డారు
    • బీసీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారు
    • ఆర్థికంగా, ఆత్మగౌరవంతో బతికేలా సర్కార్ చేయూత
    • కల్లుగీత వృత్తి దారుల సంక్షేమానికి, అభివృద్ధికి అనేక కార్యక్రమాలు
    • గౌడన్నలకు బీమా తో పాటు కళ్యాణ లక్ష్మి, రైతుబంధు తదితర పథకాల్లో బీసీలదే మెజార్టీ వాటా
    • ఉద్యమకారుడు వెనుకబడిన వర్గాల ప్రతినిధి పల్లె రవికుమార్ గౌడ్ కు సీఎం కేసీఆర్ గొప్ప అవకాశం ఇచ్చారు
    • రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన పల్లె రవికి శుభాకాంక్షలు
    • డి ఎస్ ఎస్ భవన్ లో పల్లె రవికుమార్ గౌడ్ పదవి బాధ్యతల స్వీకార కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్

తెలంగాణ రాష్ట్ర కల్లు గీత కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన పల్లె రవికుమార్ గౌడ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ నేడు హైదరాబాద్లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్లో సహచర మంత్రులు జగదీశ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల తో కలిసి  హాజరయ్యారు, 

ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ..  బీసీలు వెనుకబడ్డ వారు కాదని గత పాలకుల నిర్లక్ష్యంతో వెనుకకు నెట్టేయబడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలతో పాటు యావత్ తెలంగాణ సమాజం కు రాష్ట్రాన్ని సాధించి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎనలేని సేవ చేస్తున్నారన్నారు. బీసీల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం నిరంతరం పాటు పడే ప్రభుత్వం తమది అని, కళ్యాణ లక్ష్మి రైతుబంధు రైతు బీమా తదితర పథకాల్లో బీసీలదే మెజార్టీ వాటా అన్నారు.

రాష్ట్రంలో కులవృత్తులకు పూర్వ వైభవం తీసుకొచ్చేలా కేసీఆర్ గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారని, సంక్షేమ అభివృద్ధి కోసం నీరా కేఫ్ ను ప్రారంభించడంతోపాటు గౌడ భీమా సైతం ప్రకటించారని, నేడు కళ్ళు గీత వృత్తిదారుల కార్పొరేషన్ చైర్మన్ గా ఉద్యమకారుడు, బీసీ బిడ్డ అయిన పల్లె రవికుమార్ గౌడ్ కి అవకాశం కల్పించారన్నారు. పల్లె రవికుమార్ గౌడ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని గౌడ వృత్తి దారులందరికీ సంక్షేమ అభివృద్ధి పలాలు అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు మంత్రి గంగుల కమలాకర్. బీసీ సంక్షేమ శాఖ తరపున నిరంతరం ఆయనకు అందుబాటులో ఉంటానని బీసీల అభివృద్ధి కోసం కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు.