mt_logo

కుసుమ జగదీష్, సాయి చంద్ ఇరు కుటుంబాలకు 3 కోట్ల ఆర్ధిక సాయం : మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌ తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు కుసుమ జగదీష్, వేద సాయి చంద్ అకాల మరణానికి సంతాపం మంత్రి కేటీఆర్ తెలిపారు.  ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్న ఇద్దరు యువ నాయకులు అకాల మరణం చెందడం కేసీఆర్ ను ఎంతగానో కలిచి వేసిందని అన్నారు. వారి కుటుంబ పరిస్థితులు తెలుసుకుని, వారి యోగక్షేమాల కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితర 150 మందికి పైగా ప్రజాప్రతినిధుల ఒక నెల జీతం సుమారు మూడు కోట్లకు పైగా ఆ రెండు కుటుంబాలకు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇరు కుటుంబాలకు కోటిన్నర చొప్పున అందిస్తాం.. కుసుమ జగదీష్, సాయి చందు తల్లిదండ్రులను కూడా పార్టీ తరఫున ఆదుకుంటామని హామీ ఇచ్చారు.