mt_logo

అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి భేష్ : సింగపూర్ కల్చరల్ అసోసియేషన్ ప్రతినిధులు

రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ B. వినోద్ కుమార్ ను సింగపూర్ పర్యటనలో తెలంగాణ సింగపూర్ కల్చరల్ సొసైటీ ప్రతినిదులు మర్యాద పూర్వకంగా కలిసి సింగపూర్ లో నిర్వహించనున్న లష్కర్ బోనాలకు ఆహ్వానించారు. 

ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… ఉద్యోగ, ఉపాధి కోసం తెలంగాణ నుండి ఇతర దేశాలకు వలస వచ్చిన తమ సంస్కృతి, సాంప్రదాయాలను కొనసాగిస్తున్న సింగపూర్ లోని తెలంగాణ ప్రజలను, అందుకు కృషి చేస్తున్న సింగపూర్ తెలుగు కల్చరల్ సొసైటీ ప్రతినిధులను మంత్రి ఈ సందర్భంగా అభినందించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నేతృత్వంలో ఐటీ, పరిశ్రమలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారని మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడానికి గర్వపడుతున్నామని సింగపూర్ కల్చరల్ అసోసియేషన్ ప్రతినిధులు ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం గతంలోనే ఏర్పడి ఉంటే తమ భవిష్యత్తు ఎంతో బాగుండేదని, ఉద్యోగం, ఉపాధి కోసం ఇతర దేశాలకు వచ్చేవారం కాదని వారు మంత్రికి తెలిపారు. సింగపూర్ లోని తెలంగాణ ప్రజలు జరుపుకుంటున్న లష్కర్ బోనాలకు వచ్చే సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాంస్కృతిక శాఖ నుండి కళాకారులను పంపిస్తామని మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ తెలియజేశారు. 

రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ గారు మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రజలు ఖండాలు దాటిన తమ సంస్కృతిని ఆచార వ్యవహారాలను కొనసాగించడాన్ని స్వాగతించారు. గత ఉమ్మడి రాష్ట్రంలో ఈ పరిస్థితి భిన్నంగా ఉండేదన్నారు.  రాష్ట్రం  సాధించుకున్న తర్వాత  తెలంగాణ ప్రాంత ప్రజలు తమ సాంస్కృతి , సాంప్రదాయాలను స్వేచ్ఛగా జరుపుకుంటున్నారని ఆనందం వ్యక్తం చేశారు. సింగపూర్ కల్చరల్ అసోసియేషన్ ప్రతినిధులను ఈ సందర్భంగా అభినందించారు. లష్కర్ బోనాలను ఘనంగా నిర్వహించటాన్ని  ప్రోత్సహించారు.