mt_logo

డిసెంబర్ 9వ తేదీలోగా నెరవేరుస్తామన్న కాంగ్రెస్ గ్యారంటీల పరిస్థితి ఏంటి?.. కేటీఆర్

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఎక్స్ (X) లో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలు ప్రశ్నలు సంధించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సిగ్గు లేకుండా ప్రజలను మోసగించేలా అబద్ధపు హామీలు ఇవ్వడం వలనే మా పార్టీ ఎన్నికల్లో ఓడిపోయింది.. ఇచ్చిన హామీ మేరకు డిసెంబర్ 9వ తేదీ నాటికి నెరవేరుస్తామన్న కాంగ్రెస్ పార్టీ హామీల సంగతి ఏమిటని కేటీఆర్ ప్రశ్నించారు.

రైతులకు, కౌలు రైతులకు, రైతు కూలీలకు ఇస్తామన్న రైతు భరోసా ఎక్కడ పోయింది?

రెండు లక్షల రూపాయల వ్యవసాయ రుణమాఫీ ఏమయింది?

4వేల రూపాయల ఆసరా పెన్షన్ ఏమైంది?

500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అన్న మాట ఎక్కడ పోయింది?

ప్రతి మహిళకు 2500 ఇస్తామన్నారు కదా ఆ మాట ఏమైంది?

మొదటి కేబినెట్ లోనే మెగా డీఎస్సీ పైన ప్రకటన ఉంటుందని చెప్పిన హామీపై చర్యలు ఏవి?

మొదటి కేబినెట్ లోనే 6 గ్యారంటీలకు చట్టబద్ధత తీసుకువస్తామని చెప్పిన మాట ఏది?

ఇలా మీరు ఇచ్చిన హామీలు నకిలీవా లేదా ఈ మాటలు చెప్పిన మీ కాంగ్రెస్ నేతలు నకిలీలా చెప్పాలి అని కేటీఆర్ ప్రశ్నించారు. మరి అధికారంలో ఉండి మొన్నటి ఎన్నికల్లో అధికారం కోల్పోయిన ఓడిపోయిన మీ పార్టీ పరిస్థితి వివరించగలరా అని కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను కేటీఆర్ ప్రశ్నించారు.

ఈరోజు ఉదయం సిద్ధరామయ్య వీడియో ఒకటి వైరల్ కావడంతో దాన్ని ప్రస్తావిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు డబ్బులు లేవంటున్న కర్ణాటక సీఎం, ఇదే మాట తెలంగాణ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ చెబుతుందా అంటూ కేటీఆర్ సందేహం వ్యక్తం చేశారు. ఆర్థిక పరిస్థితి గురించి సాకులు చెబుతున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇవ్వడానికి ముందు కనీసం అధ్యయనం చేయలేదని కేటీఆర్ అన్నారు. కేటీఆర్ ట్వీట్ పైన స్పందించిన సిద్ధరామయ్యకు, మరోసారి పలు ప్రశ్నలను కేటీఆర్ సంధించారు