mt_logo

గాయకుడు సాయిచంద్‌ కుటుంబానికి అండగా ఉంటాం: మంత్రి కేటీఆర్‌

తెలంగాణ ఉద్యమకారుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, ప్రముఖ గాయకుడు సాయిచంద్ భౌతికకాయానికి మంత్రి కేటీఆర్‌ నివాళులు అర్పించారు. రంగారెడ్డి జిల్లా గుర్రంగూడలోని సాయిచంద్‌ నివాసానికి వెళ్లిన మంత్రి కేటీఆర్‌..  సాయి చంద్ పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. సాయిచంద్‌ అద్భుతమైన కళాకారుడని  అన్నారు.మా అందరికీ ఆత్మీయుడు, చనిపోయడనే వార్త జీర్ణించుకోలేక పోతున్నాం, ఆయన లేని లోటు తీర్చలేము, హైదరాబాద్ లో ఉంటే బ్రతికే వాడేమో.. చిన్న వయస్సులోనే చనిపోవడం బాధాకరమని అన్నారు మంత్రి కేటీఆర్.  తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పనిచేశారని వెల్లడించారు. సాయిచంద్‌ మరణం తీరని లోటని తెలిపారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.