mt_logo

పాట ఉన్నన్ని రోజులు సాయిచంద్ పేరు శాశ్వతంగా నిలిచిపోతుంది : మంత్రి కేటీఆర్

తెలంగాణ ఉద్యమకారుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, ప్రముఖ గాయకుడు సాయిచంద్ మరణంపై మంత్రి కేటీఆర్ తన సంతాపం తెలిపారు. సాయిచంద్ మరణం తనని దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. యువకుడైన సాయిచంద్ అకాల మరణం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి తెలంగాణ సమాజానికి ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి పార్టీకి తన గొంతుక ద్వారా ఎనలేని సేవలు చేసిన సాయిచంద్ మరణం తీరని లోటు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా సాంస్కృతిక రంగంలో పాట ఉన్నన్ని రోజులు సాయిచంద్ పేరు శాశ్వతంగా నిలిచిపోతుందన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.