mt_logo

మళ్లీ విజయం మనదే.. హైరానా పడొద్దు: బీఆర్ఎస్ అభ్యర్థులతో సీఎం కేసీఆర్

బీఆర్ఎస్ అభ్య‌ర్థుల‌కు బీ-ఫారాల అంద‌జేత సంద‌ర్భంగా తెలంగాణ భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్.. వారిని ఉద్దేశించి మాట్లాడుతూ.. మల్లి విజయం మనదే.. తొందర పడొద్దని అన్నారు. పార్టీ అభ్యర్థులతో సీఎం కేసీఆర్. కీలక అంశాలపై అభ్యర్థులకు దిశానిర్దేశం చేసిన కేసీఆర్.  నామినేషన్లకు ఇంకా సమయం ఉందన్నారు. హైరానా పడకండని ధైర్యం చెప్పారు. ముందుగానే బీ ఫామ్ ఇస్తున్నాం, జాగ్రత్తగా బీ ఫామ్స్ నింపండని సూచించారు. చివరి రోజు వరకు సమయం ఉందని ఆగమాగం అవకండని అన్నారు. చివరి రోజే అందరూ వేయాలని ఇబ్బంది పడకండని చెప్పారు. బీ ఫామ్స్ తప్పుగా నింపకండని సూచించారు. 

టెక్నికల్ ఇష్యూస్ వస్తాయని తెలిపారు. శ్రీనివాస్ గౌడ్, గద్వాల ఎమ్మెల్యే బండ కృష్ణ మోహన్ రెడ్డి తోం పాటు కొంత మంది తప్పుగా అఫిడవిట్ ఇచ్చారని కేసులు పెట్టారని, అలా అజాగ్రత్త ఉండకండని అన్నారు. న్యాయ కోవిదులు ఉన్నారని,  అంత మాకే తెలుసు అనుకోకండని అన్నారు. కచ్చితంగా వారిని సంప్రదించాలని పేర్కొన్నారు. ఎన్నికకు ఎన్నికకు కొత్త నిబంధన వస్తున్నాయని తెలిపారు. తమ దగ్గర న్యాయవాదుల టీమ్ ఉందని సూచించారు. అప్డేట్ ఓటర్ లిస్ట్ వచ్చింది. ఇవాళ రేపు కూడా బీ ఫామ్ ఇస్తామని అన్నారు. ఇవాళ ఒక్కరోజు 51 మందికి బీ ఫామ్ ఇస్తున్నామని పేర్కొన్నారు.