mt_logo

నేడు బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేయనున్న సీఎం కేసీఆర్

నేడు తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నాం 12.15 ని.లకు  కేసీఆర్  బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో  విడుదల చేయనున్నారు. వెంటనే బీఆర్ఎస్ పార్టీ  అభ్యర్థులకు బీ-ఫామ్ లు కేసీఆర్ అందజేస్తారు. అనంతరం 119 ఎమ్మెల్యే అభ్యర్థులకు దిశ నిర్దేశం చేస్తారు. వెంటనే ఎన్నికల ప్రచార ఖర్చుల కోసం అభ్యర్థులకు చెక్కులు అందజేస్తారు. ఇప్పటికే 114 స్థానాల ప్రకటన మరో ఐదు స్థానాలకు కూడా ఈరోజు అభ్యర్థులను ప్రకటిస్తారు. అధిష్టానం పిలుపుతో కొద్ది సేపట్లోనే తెలంగాణ భవన్ కు బయలు దేరనున్న ఎమ్మెల్యే అభ్యర్దులు,పార్టీ శ్రేణులు.ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య మ్యానిఫెస్టో విడుదల, బీ-ఫారాల అందజేత కార్యక్రమం ఉండనుంది.