నిజామాబాద్: సీఎం కేసీఆర్ 2001 లో ఇచ్చిన మాట నిల బెట్టుకొని రైతుల గుండెల్లో చిరస్మరణీయ ముద్ర వేసుకున్నారని అన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. గురువారం ఎస్సారెస్పీ వరద కాలువకు కాళేశ్వరం జలాలు చేరుకోవడంతో జిల్లాలోని కమ్మర్పల్లి మండలం ఉప్లుర్ వద్ద కాళేశ్వరం జలాలకు మంత్రి పూజలు చేసారు మంత్రి. ఈ కార్యక్రమానికి రైతులు భారీగా తరలి వచ్చారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు. రైతుల కల నెరవేరిన రోజు ఇది, ఎప్పటికైనా..తెలంగాణ రైతులతో పాటు దేశ రైతాంగానికి కేసీఆరే శ్రీరామరక్ష. గోదారమ్మ ఎదురు ఎక్కుతదని కలలో కూడా ఊహించలేదన్నారు.
సీఎం కేసీఆర్ కు రైతుల పక్షాన ధన్యవాదాలు తెలిపారు మంత్రి. నా హయం లో ఎస్సారెస్పీ పునర్జీవం పనులు పూర్తి అవ్వడం నా అదృష్టంగా భావిస్తున్న అన్నారు. 2001 లో ఇచ్చిన మాట నిల బెట్టుకొని రైతుల గుండెల్లో చిరస్మరణీయ స్థానాన్ని సీఎం కేసీఆర్ సంపాదించారని గుర్తు చేసారు. 300 కిలో మీటర్ లు రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని తరలించడం చాలా గొప్ప విషయం, ఇక వర్షాలతో సంబంధం లేకుండా సంవత్సరం పొడువునా రైతులకు సాగునీరు. కాళేశ్వరం తో కేసీఆర్ కు మంచి పేరు వస్తుందనే ప్రతిపక్షాలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. 90 వేల కోట్లతో పనులు జరిగితే లక్ష కోట్ల అవినీతి జరిగింది అనటం హాస్యాస్పదం, ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు చేస్తే అంతకు రెట్టింపు అభివృద్ధి చేసి చూపిస్తాం అన్నారు. కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు మహారాష్ట్ర ,కర్ణాటక ,తమిళనాడు తో పాటు యావత్ దేశ రైతులు కొనియాడుతున్నారు. రైతులు… ప్రతి పక్షాల ఆరోపణలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.