సిద్దిపేట నుండి సికింద్రాబాద్ వెళ్ళే రైలును జెండా ఊపి మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లాకి రైలు రావడం గొప్ప వరమన్నారు. గత ప్రభుత్వాలు పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడు జరిగిన సిద్దిపేటకి రైలు తెస్తాం అని అబద్ధాలు చెప్పారని అన్నారు. 2006లో రైల్వే లైన్ మంజూరు అయ్యింది 33% రాష్ట్ర వాటా చెల్లించాలని చెప్పింది. సీఎం కేసీఆర్ రైల్వే లైన్‌ని స్వయంగా రూపకల్పన చేశారని గుర్తు చేసారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రులు మారారు కానీ రైల్వే లైన్ రాలేదని అన్నారు. ఆనాడు కేంద్ర మంత్రిగా కేసీఆర్ ఉన్నారు.. ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లించింది కేసీఆర్, సిద్దిపేట, మెదక్, కరీంనగర్ పై ఆనాటి ప్రభుత్వాలు కక్ష కట్టాయన్నారు.
బీజేపీ వాళ్ళు రైలు మా వల్లే వచ్చిందని చెబుతున్నారు ఇది సిగ్గుచేటు 33 శాతం వాటా కడితే కనీసం సీఎం ఫోటో కూడా పెట్టలేదన్నారు. 2508 ఎకరాల భూసేకరణ కోసం రూ. 310 కోట్లు చెల్లించింది తెలంగాణ ప్రభుత్వమే అని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద 330 కోట్లు ఇచ్చాము.. దీంట్లో కేంద్ర ప్రభుత్వం ఏమి చేసింది అని ప్రశ్నించారు. సిద్దిపేట రైల్వే లైన్ కోసం కష్టపడ్డది మేము.. డబ్బులు ఇచ్చింది మేము.. ఈ విజయం తెలంగాణ ప్రజలది ఆనాడు 9 ఏళ్ళు కాంగ్రెస్ మోసం చేసింది.. ఈనాడు బీజేపీ అబద్ధాలు ఆడుతుంది. కేసీఆర్ లేకపోతే రైల్వే లైన్ లేదని స్పష్టం చేసారు.