టీపీసీసీ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డి మరోసారి నోరు జారారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం రైతాంగానికిస్తున్న ఉచిత విద్యుత్ గురించి తానా సమావేశాల్లో భాగంగా అమెరికా పర్యటనలో రేవంత్ రెడ్డి మాట్లాడిన రైతులకు మూడు గంటల కరెంటు చాలు అనే వ్యాఖ్యలపై యావత్ తెలంగాణ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు హోరెత్తుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్ తరపున ఈ నెల పదిహేడు తారీఖు నుండి దాదాపు పది రోజులు నిరసన కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలని పిలుపు కూడా ఇచ్చారు.. తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ మాట్లాడుతూ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సతీమణి ఇందిరా గాంధీ అంటూ నోరు జారిన వ్యాఖ్యలపై ఇటు కాంగ్రెస్ వాదుల్లో..ఆ పార్టీలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.