–రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై దొమ్మరుల సంఘం రాష్ట్ర వ్యాప్త నిరసనలు, రాష్ట్ర అధ్యక్షుడు ఆరే రాములు ద్వజం

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై తెలంగాణ రాష్ట్ర దొమ్మరులు ద్వజమెత్తారు. దొమ్మరుల పట్ల, ఆ సామాజిక వర్గం పట్ల రేవంత్ రెడ్డి కించపరిచే వ్యాఖ్యలను ఖండిస్తూ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మలను ఊరూరా ఊరేగిస్తూ చెప్పుదెబ్బలతో నిరసన వ్యక్తం చేయాలని తెలంగాణ రాష్ట్ర దొమ్మరుల సంఘం, తెలంగాణ సంచార జాతుల సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన ప్రెస్ మీట్ లో దొమ్మరు ల పదాన్ని వాడడాన్ని ఆ సంఘం తప్పు పట్టింది. ఈ మేరకు దొమ్మరుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆరే రాములు ఒక ప్రకటన విడుదల చేస్తూ రేవంత్ రెడ్డి రెడ్డి కుల దురహంకారం తో మదమెక్కిన ఆంబోతులా వ్యవహరిస్తున్నారని ద్వజ మెత్తారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తాజాగా ప్రెస్ మీట్ లో చేసిన దొమ్మరుల సామాజికవర్గాన్ని ఉటంకిస్తూ వాడిన పదాలపై, ఆ కులం పట్ల తన వ్యాఖ్యలను 24 గంటల్లోగా వెనక్కి తీసుకుని తెలంగాణ రాష్ట్ర దొమ్మర సమాజానికి భేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆ సంఘం డిమాండ్ చేసారు. లేని పక్షంలో దొమ్మరు లతో రేవంత్ రెడ్డికి చెప్పు దెబ్బలతో సమాధానం చెప్పడంతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలకు దొమ్మరలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
కేవలం రెడ్డి సామాజిక వర్గమే పరమాదిగా సాగుతున్న రేవంత్ రెడ్డి అహంకారానికి సబ్బండ సంచార జాతులు ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని చెప్పారు. పనిచేసే ప్రభుత్వానికి, పని చేసే నాయకత్వానికి సంచారజాతుల మద్దత్తు ఎప్పుడు ఉంటుందన్నారు. దొమ్మర గంతులు వేయడం, దొమ్మర గుడిసెలు దూరడం వంటి పదాలను పరిపాటిగా వాడుతూ తమ కులాన్ని మానసిక క్షోభకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మొదటి నుండి రేవంత్ రెడ్డి రెడ్డి కుల దురహంకారం తోనే చిన్న కులాల పట్ల రకరకాల వ్యాఖ్యలు చేస్తూ అవమానిస్తున్నారని ద్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల పట్ల ముఖ్యంగా సంచార జాతుల పట్ల కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్య దోరణీకి అద్దం పడుతున్నాయని, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలో కుల వివక్ష స్పష్టంగా తేటతెల్లమవుతున్నదని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఆయుధాలుగా తమను వాడుకుంటూనే తమ కులాలను అవహేళన చేయడం ఏమేరకు సబబని ప్రశ్నించారు. అందుకే వచ్చే ఎన్నికల్లో దొమ్మరులు, వంశరాజులు, (పిచ్చుకకుంట్ల), గంగిరెద్దుల సహా సబ్బండ సంచార జాతి వర్గాలు కాంగ్రెస్ పార్టీకి చిత్తు చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ చిన్న కులాల పట్ల చూపుతున్న వివక్షపై చర్చించి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. దేశంలో రాష్ట్రంలో కనుమరగవుతున్న కాంగ్రెస్ పార్టీకి దళితులు, సంచార జాతులు దూరంగానే ఉంటున్నారని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో సంచార జాతులు ఆత్మగౌరవంతో బతుకుతున్నాయని పేర్కొంటూ సంచార జాతుల పట్ల ప్రభుత్వం తీసుకుంటున్న చొరవను ఆయన అభినంధించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన ట్వీట్ లో వ్యాఖ్యలను 24 గంటల్లోగా వెనక్కితీసుకుని తెలంగాణ రాష్ట్ర దొమ్మర సమాజానికి భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కార్యాచరణ రూపొందించి దొమ్మరులతో రేవంత్ రెడ్డి కి చెప్పు దెబ్బలతో సమాధానం చెప్పడం తో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలకు దొమ్మరులు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కేవలం రెడ్డి సామాజిక వర్గమే పరమాదిగా సాగుతున్న రేవంత్ రెడ్డి అహంకారానికి సబ్బండ సంచార జాతులు ఈ ఎన్నికల్లో తగిన బుద్ది చెబుతారని చెప్పారు. పనిచేసే ప్రభుత్వానికి, పని చేసే నాయకత్వానికి సంచారజాతుల మద్దతు ఎప్పుడు ఉంటుందన్నారు.