• విద్యుత్తు విజయం..
• చిమ్మ చీకటిని చీలుస్తూ..
• 24 గంటల కరంట్..
హైదరాబాద్, జూన్ 5: అరవై ఏండ్ల పరిపాలనలో ఏ ఒక్క ప్రభుత్వమూ విద్యుత్తు సమస్యను పరిష్కరించలేదు. వ్యవసాయానికి చాలినంత విద్యుత్తును సరఫరా చేయకపోవడంతో పంటలెండిపోయి రైతన్నలు పడ్డ పాట్లు చెప్పనలవికాదు. జనజీవితంలో జనరేటర్లు ఇన్వర్టర్లు, కన్వర్టర్లు అనివార్యమై పోయాయి. పదేపదే మోటార్లు కాలిపోయేవి. పటాకుల వలె ట్రాన్స్ ఫార్మర్లు పేలిపోయేవి. పవర్ హాలిడేలతో పరిశ్రమలు కునారిల్లిపోయేవి. పారిశ్రామికవేత్తలు ఇందిరాపార్కు దగ్గర ధర్నాకు దిగాల్సిన దయనీయ పరిస్థితి ఆవరించి ఉండేది. తెలంగాణ వస్తే రాష్ట్రం అంధకార బంధురమవుతుందని, తీగెల మీద బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుందని సమైక్య పాలకులు ఎద్దేవా చేశారు. శాపనార్ధాలు పెట్టారు. కానీ, వారి అంచనాలను తలకిందులు చేస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు గారి మార్గదర్శనం లో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్తు రంగంలో విప్లవాత్మక విజయాలు సాధించింది. నేడు అన్ని రంగాలకు నిరంతరాయంగా 24 గంటల పాటు, వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్తు సరఫరా చేసే ఏకైక రాష్ట్రంగా తెలంగాణ కీర్తి దేశం నలుదిశలా వ్యాపించింది.
తెలంగాణ రైతుకు కరెంటు లేక నీళ్ళు ఆగిపోతాయనే రంది లేదు. మోటర్ కాలిపోతదన్న భయం లేదు. చివరి మడి దాకా తడి ఒక్కతీరుగ అందుతున్నది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు కోసం ప్రభుత్వం ఏటా 12 వేల కోట్లు ఖర్చు చేస్తూ రైతు సంక్షేమం పట్ల తన చిత్తశుద్ధిని చాటుకుంటున్నది. తెలంగాణ రాష్ట్రంలో క్రాప్ హాలిడేలు, పవర్ హాలిడేలు అనే మాటే లేదు. అందుకే ఇవాళ తెలంగాణ మోడల్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడే నాటికి స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం 7,778 మెగావాట్లు కాగా, నేడది 18,453 మెగావాట్లకు పెరిగింది. నాడు సోలార్ పవర్ ఉత్పత్తి 74 మెగావాట్లు మాత్రమే ఉండగా, నేడది 5,741 మెగావాట్లకు పెంచగలిగాం.
సౌర విద్యుదుత్పత్తిలో తెలంగాణ దేశంలో అగ్రభాగాన నిలిచింది
తెలంగాణ విద్యుత్తు రంగాన్ని తీర్చిదిద్దడం కోసం ప్రభుత్వం త్రిముఖ వ్యూహాన్ని అనుసరించింది. సంస్థలో అంతర్గత సామర్థ్యాన్ని మెరుగుపరిచింది. ప్లాంటు లోడ్ ఫ్యాక్టర్ పెంచుకున్నది. పంపిణీలో నష్టాలను నివారించుకున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఛత్తీస్ గఢ్ తో విద్యుత్తు కొనుగోలు ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల వార్దా నుంచి హైదరాబాద్ కు 765 కె.వి. డీసీ లైను నిర్మాణానికి అవకాశం ఏర్పడింది. ఉత్తర, దక్షిణ గ్రిడ్ ల మధ్య పి.జి.సీ.ఐ.ఎల్. ఆధ్వర్యంలో కొత్త లైన్ల నిర్మాణం జరిగింది. దీంతో దేశంలో ఎక్కడి నుంచైనా విద్యుత్తును ఇచ్చి పుచ్చుకునే అవకాశం ఏర్పడింది. శాశ్వతంగా సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం కొత్త పవర్ స్టేషన్లను నిర్మించింది. రికార్డు సమయంలో కేటీపీఎస్ 7వ దశ నిర్మాణాన్ని పూర్తి చేసింది. భూపాలపల్లి, జైపూర్ ప్లాంట్ల నిర్మాణం పూర్తిచేసి 1800 మెగావాట్ల విద్యుత్తును అదనంగా అందుబాటులోకి తెచ్చింది. జూరాల, పులిచింతల నుంచి 360 మెగావాట్ల హైడల్ పవర్ సమకూర్చింది. తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన 1080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ లో ఉత్పత్తి ప్రారంభమైంది. 4000 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో టీఎస్.జెన్కో దామరచర్లలో నిర్మిస్తున్న యాదాద్రి అల్ట్రా మెగా పవర్ ప్లాంటు నిర్మాణం తుదిదశకు చేరుకున్నది. త్వరలోనే ఈ ప్లాంట్ ఫలితాలు మనకు అందనున్నాయి.
ఉత్పత్తితోపాటు సరఫరాను మెరుగు పరచడంలో కూడా తెలంగాణ విద్యుత్తు సంస్థలు ఎంతో ప్రగతి సాధించాయి. 22,502 కోట్ల రూపాయల వ్యయంతో సబ్ స్టేషన్ల నిర్మాణం, పవర్ ట్రాన్స్ ఫార్మర్ల ఏర్పాటు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్లు, కొత్త లైన్ల నిర్మాణం చేయడంతో పంపిణీ వ్యవస్థ బలోపేతమైంది. నేడు తలసరి విద్యుత్తు వినియోగంలో సైతం తెలంగాణ ఎంతో ముందున్నది. 2014-15లో తెలంగాణలో తలసరి విద్యుత్తు వినియోగం 1,356 యూనిట్లు కాగా, 2021-22 నాటికి 2,126 యూనిట్లకు పెరిగింది. ఇదే సమయంలో జాతీయ సగటు 1,255 యూనిట్లు మాత్రమే ఉంది. అంటే జాతీయ తలసరి వినియోగం కన్నా తెలంగాణలో తలసరి విద్యుత్తు వినియోగం 69 శాతం ఎక్కువ.
కరెంటు కష్టాలకు చరమగీతం పాడిన రాష్ట్రం..
- అన్ని రంగానికి 24 గంటల పాటు నాణ్యమైన కరెంటు
- వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
2014-15 నుండి 2021-22 వరకు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కోసం రూపాయలు రూ.36,890 కోట్ల సబ్సిడీని నాణ్యమైన విద్యుత్ కోసం అందించిన రాష్ట్ర ప్రభుత్వం. 39,321కోట్లతో విద్యుత్ వ్యవస్థ, సరఫరా పంపిణీ వ్యవస్థల పటిష్టం. 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు దార్శనికతో వ్యవసాయ అనుకూల విధానాలతో గత ఎనిమిది సంవత్సరాలల్లో వ్యవసాయ స్వరూపం మారిపోయింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు గారు విద్యుత్ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి, రాష్ట్రం ఏర్పడిన ఆరు నెలలలో విద్యుత్ పై సమీక్షించి రైతులకు నాణ్యమైన కరెంటును అందుబాటులోకి తెచ్చారు. వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత కరెంటు పథకాన్ని అమల్లోకి తెచ్చారు. దేశంలో 24 గంటల పాటు 26.96 లక్షల వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు ఉచితంగా విద్యుత్ సరఫరా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.రాష్ట్రం ఏర్పడే నాటికి పగటిపూట మూడు గంటలు, రాత్రిపూట మూడు గంటలు విద్యుత్ పవర్ కట్ ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితుల నుండి నేడు 24 గంటల ఉచిత విద్యుత్ను పొందేలా చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుంది.
2014 నుండి 7.93 లక్షల వ్యవసాయ విద్యుత్తు సర్వీస్ లు విడుదలయ్యాయి. రైతన్ననికి ఉచిత విద్యుత్ అందిస్తున్న నేపథ్యంతో వ్యవసాయ రంగానికి 36,890 వేల కోట్లు సబ్సిడీగా ప్రభుత్వం అందించింది. గత 9 సంవత్సరాల లో అన్ని వర్గాలకు 39,321 కోట్లతో సరఫరా పంపిణీ వ్యవస్థలకు బలోపేతం చేయడంతో రాష్ట్రంలోని వినియోగదారులందరికి నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నది. 2014 నుండి గత 9 సంవత్సరాల లో ట్రాన్స్కో ద్వారా 400 కే.వి సబ్స్టేషన్లో 17, 200 కేవీ సబ్స్టేషన్లు 48,132 కెవి సబ్ స్టేషన్లు 72, ఈహెచ్ టి సబ్ స్టేషన్లు 137, 11107 CKM ఈ హెచ్ టి లైన్ , డిస్కంల ద్వారా 33/11 కెవి సబ్ స్టేషన్ 1038 లు 3.65 లక్షల డిటిఆర్ లను నిర్మించి విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థలను పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా పటిష్ట పరచడం జరిగినది. 14160 మెగావాట్లు పిక్ డిమాండ్ ను కూడా మీట్ చేయడం జరిగినది. గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రం పరస్పర పనులను పవర్ హాలిడే ఇబ్బందులు పడ్డ పరిశ్రమలు నేడు 24 గంటల విద్యుత్ తో పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయి.
కార్మికులకు నిరంతర ఉపాధి లభిస్తున్నది. తలసరి విద్యుత్ వినియోగ వృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచింది 2014లో తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం 1110 యూనిట్లు ఉంటే 2023 మార్చ్ 31 నాటికి 2126 యూనిట్లుకు చేరింది. జాతీయ తలసరి విద్యుత్ వినియోగం 73% అధికంగా ఉంది ఇది రాష్ట్ర ప్రగతికి నిదర్శనం.
రాష్ట్రంలో 2.47% అతి తక్కువ సరఫరా నష్టాలతో తర్వాత 99.98% ట్రాన్స్మిషన్ అవైలబిలిటీ తో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఘనత సాధించింది. రాష్ట్రం ఏర్పడే నాటికి 16.06% ఉన్న ట్రాన్సమిషన్ ,డిస్ట్రిబ్యూషన్ టి అండ్ డి నష్టాలను 11.01% తగ్గించడం జరిగింది. రాష్ట్రం ఏర్పడే నాటికి సోలార్ విద్యుత్ లో సామర్థ్యం 73 MW ఉంటే నేడు అది 4950 MW కు చేరింది. ఒకపక్క విద్యుత్ ఉత్పత్తి చర్యలు తీసుకుంటూ మరోపక్క సరఫరా పంపిణీ ప్రాధాన్యతనిస్తుంది.
రైతులకు ఉచిత విద్యుత్ తో పాటు 101 యూనిట్ల వరకు ప్రతి నెల 59 66 42 మంది ఎస్సీ వినియోగదారులకు, 321 736 మంది ఎస్టీ వినియోగదారులకు 2017 నుండి ఇప్పటివరకు 656 కోట్ల విలువగల విద్యుత్ను ఉచితంగా ఇవ్వడం అయినది 29365 నాయి బ్రాహ్మణులకు సెలూన్ లకు 56616 లాండ్రీ షాపులకు ప్రతినెల 250 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తును అందిస్తున్నది 66 67 పౌల్ట్రీ యూనిట్స్, 491 పవర్ లోమ్స్ కు యూనిట్ కి రెండు రూపాయల సబ్సిడీ ఇస్తుంది.