అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతున్న తెలంగాణ సర్కారుకు సంబంధించిన సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నారు. గవర్నమెంట్‌కు సంబంధించిన డెయిలీ అప్‌డేట్స్ పొందాలనుకుంటున్నారా? పథకాలపై అవగాహన పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే.. మీ కోసమే తెలంగాణ సర్కారు సరికొత్త నిర్ణయంతో ముందుకొచ్చింది. ప్రతి సమాచారాన్ని వాట్సాప్‌లో చేరవేసేలా ఓ చానల్‌ను ఏర్పాటు చేసింది. సేవలను సులభతరం చేసేందుకుగానూ ‘తెలంగాణ సీఎంవో’ పేరిట ఏర్పాటు చేసిన ఈ చాన్‌ళను బుధవారం నుంచి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ చాన్‌ల్‌ను ఫాలో అయితే సీఎం కేసీఆర్‌కు సంబంధించిన వార్తలు ఎప్పటికప్పుడు మీ ఫోన్లో చూసుకోవచ్చు. ఈ చానల్‌ను ఐటీ శాఖకు చెందిన డిజిటల్ మీడియా విభాగం.. సీఎం పీఆర్వో సమన్వయంతో నిర్వహిస్తున్నది. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి, ఈ చానల్‌లో జాయిన్ కావచ్చు. ఇకనుంచి సులభతరంగా ప్రభుత్వ సమాచారాన్ని పొందొచ్చు.
చానల్‌ను ఫాలో అవడం ఇలా..
-ముందుగా మీ వాట్సాప్ అప్లికేషన్‌ను ఓపెన్ చేయండి.
-మొబైల్‌లో అప్‌డేట్స్ విభాగాన్ని సెలెక్ట్ చేసుకోండి. డెస్క్‌టాప్‌లో అయితే చానల్స్ ట్యాబ్‌పై క్లిక్ చేయండి
-అనంతరం ‘+’ బటన్ పైన క్లిక్ చేసి ‘ఫైండ్ చానల్స్’ ను ఎంచుకోండి.
-టెక్ట్స్ బాక్స్‌లో తెలంగాణ సీఎంవో అని ఇంగ్లిష్‌లో టైపు చేయండి.. ఆ జాబితా నుంచి చానల్‌ను ఎంచుకోండి.
-ఈ కింది క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి కూడా తెలంగాణ సీఎంవో వాట్సాప్ చానల్‌లో చేరొచ్చు.