mt_logo

G20 సదస్సు ప్రపంచ దేశాలకు దిశానిర్దేశం : కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి నరేంద్రసింగ్

హైదరాబాద్ (మే 15) : జూన్ 15-17 మధ్య హైదరాబాద్ లో జరగనున్న G20 అంతర్జాతీయ శిఖరాగ్ర సదస్సు ముందస్తు ఏర్పాట్లపై మాదాపూర్ హెచ్ఐసీసీ లో నిర్వహించిన సమీక్ష కు కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తో కలిసి పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ వ్యవసాయరంగంలో ముందుకు పోతున్నది, ఉత్పత్తి, ఉత్పాదకతలో తెలంగాణ ముందున్నది. G20 సదస్సు ద్వారా తెలంగాణతో పాటు, భారత విశిష్టతను చాటి చెప్పేందుకు కలిసి పనిచేద్దాం, హైదరాబాద్ చారిత్రక నగరం. తెలంగాణ వ్యవసాయరంగంలో ముందున్న నేపథ్యంలో ఇక్కడ సదస్సు నిర్వహిస్తున్నాం.. జూన్ 15-17 మధ్య హైదరాబాద్ లో జరగనున్న G20 అంతర్జాతీయ శిఖరాగ్ర సదస్సు ముందస్తు ఏర్పాట్లపై మాదాపూర్ హెచ్ఐసీసీ లో నిర్వహించిన సమీక్షలో కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి నరేంద్ర సింగ్ తోమర్. మంత్రి నిరంజన్ రెడ్డి గారి వ్యాఖ్యలు..  ఆహార ఉత్పత్తుల్లో తెలంగాణ దేశంలో అగ్రగామిగా ఉంది, హైదరాబాద్ లో G20 సదస్సును తెలంగాణ ఆహ్వానిస్తుంది, కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుంది.

వసతులు, విదేశీ ప్రతినిధులకు స్వాగతం పలకడం, వసతుల ఏర్పాటుకు చర్యలు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయం, కళలను పరిచయం చేస్తాం… చారిత్రక విశిష్టతను చాటిచెబుతాం, హైదరాబాద్ నగరంలో సదస్సు నిర్వహించడం గర్వకారణం దేశంలోని రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉంటుంది.  పంటల మార్పిడిలో, వ్యవసాయంలో సాంకేతిక వినియోగంలో దేశంలో రాష్ట్రం ముందుంది,  ఈ సదస్సు లోతైన చర్చలతో ప్రపంచ దేశాలకు దిశానిర్దేశం చేస్తుందని ఆశిస్తున్నానమన్నారు. వ్యవసాయ రంగంలో అగ్రభాగాన ఉన్న తెలంగాణలో ఈ సదస్సు నిర్వహించడం గర్వకారణం, పోషక ఆహార భద్రత మరియు వాతావరణ మార్పుల ప్రభావం పై ప్రముఖంగా చర్చించనున్న G20 సభ్య దేశాలు జూన్ 15-17 మధ్య హైదరాబాద్ లో జరగనున్న G 20 అంతర్జాతీయ శిఖరాగ్ర సదస్సు ముందస్తు ఏర్పాట్లపై మాదాపూర్ హెచ్ఐసీసీ లో నిర్వహించిన సమీక్షకు కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి నరేంద్రసింగ్ తోమర్ గారితో కలిసి రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, హాజరైన కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి మనోజ్ అహూజా, రాష్ట్ర అడిషనల్ డీజీ శ్రీమతి అభిలాష్ బిస్త్ గారు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు గారు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.