హైదరాబాద్: కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి మనోజ్ అహూజా నేడు డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ని మర్యాదపూర్వకంగా కలిశారు. జూన్ 15-17 లలో హైదరాబాద్ లో జరగనున్న G 20 అంతర్జాతీయ శిఖరాగ్ర సదస్సు ముందస్తు ఏర్పాట్ల సమీక్షకై వచ్చిన మనోజ్ అహూజా, జాయింట్ సెక్రటరీ యోగితా రాణా లను సీ.ఎస్ శాంతి కుమారి, శాలువాతో సత్కరించారు. ఈ సందర్బంగా రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు, పెద్ద ఎత్తున పెరిగిన వ్యవసాయోత్పత్తుల తదితర వివరాలను మనోజ్ అహూజా కు సీ.ఎస్. శాంతి కుమారి వివరించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు కూడా ఉన్నారు.