mt_logo

బీడు భూములు మొత్తం మాగాణి చేయాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం 

హైదరాబాద్, జూన్ 3: రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా బోయిన్ పల్లి మార్కెట్ యార్డులో రైతులతో ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రైతులను సన్మానించారు. తెలంగాణ వచ్చిన తర్వాత 24 గంటల విద్యుత్ సరఫరా, పంట పెట్టుబడి కోసం ఎకరానికి 10 వేల ఆర్ధిక సాయం అందుతుందని గుర్తు చేసారు. ప్రతి ఎకరాకు సాగు నీరు… బీడు భూములు మొత్తం  మాగాణి చేయాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమని చెప్పారు. దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణ గా అభివృద్ధి సాధించిన తెలంగాణ, తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతులకు అండగా ఉంటుంది, వారి అభివృద్ధికి చేయూత అందిస్తుందని తెలిపారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.