mt_logo

ఐటీ శాఖ వార్షిక నివేదిక విడుదల వాయిదా

తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఒడిశా రైలు ప్ర‌మాద ఘ‌ట‌న‌పై స్పందిస్తూ..  ఆ దుర్ఘ‌ట‌న‌లో 233 మంది ప్ర‌యాణికులు ప్రాణాలు కోల్పోవ‌డం బాధాకరమైన విషయమని,  రైలు ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల‌కు మంత్రి సంతాపం తెలిపారు. ప్ర‌మాద బాధితులు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థిస్తున్న‌ట్లు తెలిపారు. రైలు ప్ర‌మాదాన్ని నివారించే యాంటీ కొలిజ‌న్ డివైస్‌లు ఏమైన‌ట్లు ఆయన అడిగారు. ఈ సంఘటన కారణంగా ఐటీ శాఖ వార్షిక నివేదిక విడుదలను సోమవారం కు వాయిదా వేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నట్లు ఆయ‌న త‌న ట్విట్ట‌ర్‌ ద్వారా తెలిపారు.