mt_logo

కేంద్రంపై సీఎం కేసీఆర్ పోరాటానికి మహారాష్ట్ర సీఎం మద్దతు… ముంబయి రావాలని పిలుపు

కేంద్ర ప్రభుత్వంపై ప్రత్యక్ష యుద్ధం ప్రకటించిన సీఎం కేసీఆర్ కు దేశవ్యాప్త మద్ధతు పెరుగుతోంది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులతో పాటు తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే సీఎం కేసీఆర్ కు ఫోన్ చేసి… బీజేపీకి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటానికి తన సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా థాక్రే మాట్లాడుతూ… ‘కేసీఆర్ జీ మీరు చాలా గొప్పగా పోరాడుతున్నారు. మీది న్యాయమైన పోరాటం. ఈ దేశాన్ని విభజన శక్తుల నుండి కాపాడుకోవడానికి సరైన సమయంలో మీరు గళం విప్పారు. రాష్ట్రాల హక్కుల కోసం, దేశ సమగ్రతను కాపాడేందుకు మీరు పోరాటం కొనసాగించండి. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగండి. మా మద్దతు మీకు సంపూర్ణంగా వుంటుంది. ఈ దిశగా దేశ ప్రజలందరినీ కూడగట్టేందుకు మా వంతు సహకారాన్ని అందిస్తాం’ అని పేర్కొన్నారు. ‘మిమ్మల్ని ముంబ‌యికి ఆహ్వానిస్తున్నాను. మీరు మా ఆతిథ్యాన్ని తీసుకోండి. అదే సందర్భంలో ఈ దిశగా భవిష్యత్ కార్యాచరణపై చర్చించుకుందాం’ అని సీఎం కేసీఆర్‌ను ఉద్ధవ్ థాక్రే ఆహ్వానించారు. దీనితో తెలంగాణ సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటన దాదాపు ఖరారైంది. ఈ నెల 20వ తేదీన మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ థాక్రేతో సీఎం కేసీఆర్ భేటీ అయి తదుపరి కార్యాచరణ చర్చించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *