mt_logo

మన పల్లె ప్రగతి – ప్రశంసిస్తున్నది యావత్ జగతి

•రాష్ట్రంలోని అన్ని గ్రామాలు ఓడిఎఫ్ ప్లస్ గ్రామాలుగా ప్రకటించబడిన ఒకే రాష్ట్రం తెలంగాణ.

•సమగ్ర గ్రామీణ అభివృద్ధికై నూతన పంచాయతీరాజ్ చట్టం అమలు.

•1851 అవాస/ తండా పంచాయతీలతో కలిపి 4,383 నూతన గ్రామపంచాయతీల ఏర్పాటు.

•5441 నూతన గ్రామ పంచాయతీ భవనాలు రూ.1088.20 కోట్ల వ్యయంతో మంజూరు చేయబడ్డాయి. 

•ప్రతి గ్రామ పంచాయతీకి పంచాయతీ కార్యదర్శులు నియమించిన మొదటి రాష్ట్రం తెలంగాణ. 

•ప్రతి గ్రామపంచాయతీలో ట్రాక్టర్, ట్యాంకర్, ట్రాలీ ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ.

•ప్రతి గ్రామపంచాయతీలో నర్సరీ, పల్లె ప్రకృతి వనం, అవెన్యూ ప్లాంటేషన్ ఏర్పాటు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ. 

ప్రతి గ్రామ పంచాయతీలో వైకుంఠధామం, డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసిన రాష్ట్రం తెలంగాణ ఒక్కటే.  

•దేశంలో ఎక్కడా లేని విధంగా 14,456 గ్రామాలలో తెలంగాణ క్రీడా ప్రాంగణాలలో ఏర్పాటు. 

•ప్రతి ఇంటికి నల్లా ద్వారా శుద్ధి చేసిన మంచినీటి సరఫరా చేస్తున్న దేశంలోనే ప్రథమ రాష్ట్ర తెలంగాణ. 

•క్రమం తప్పకుండా ప్రతి నెల గ్రామపంచాయతీలకు నిధులు విడుదల. 

హైదరాబాద్, జూన్ 14: తెలంగాణలోని ప్రతి పల్లె దేశంలోనే ఆదర్శంగా నిలపాలనుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పల్లె ప్రగతి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం అమలు వల్ల  పల్లెల రూపురేఖలు మారిపోయాయి. పల్లె ప్రగతి కార్యక్రమం కింద ఇప్పటి వరకు 11,162 కోట్ల వ్యయంతో వివిధ అభివృద్ధి కార్యక్రమం చేపట్టి అమలు చేయడం జరిగింది. ఒకప్పుడు మన దేశ గ్రామీణ భారతం  పల్లెలే మన దేశానికి పట్టుకొమ్మలు అందుకే గ్రామాల అభివృద్ధితోనే దేశ అభివృద్ధి సాధ్యమని జాతిపిత మహాత్మా గాంధీ అన్నారు.  తెలంగాణ జనాభాలో 61.12 శాతం పట్టణ గ్రామాలలో జీవిస్తున్నారు. క్రమంగా గ్రామాల జనాభా తగ్గుతూ పట్టణాల నగరాల, జనాభా పెరుగుతున్నాయి దీనిని గుర్తించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అటు పల్లెల ఇటు పట్టణాల అభివృద్ధికి పల్లె ప్రగతి పట్టణ ప్రగతి అనే రెండు పథకాలను రూపొందించి అమలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాల అమలు వల్ల గ్రామాలు, పట్టణాలు గణనీయంగా అభివృద్ధి చెందుతున్నాయి.

పల్లె ప్రగతి విజయాలు :

ప్రతి గ్రామ పంచాయతీకి  ట్రాక్టర్, ట్యాంకరు, ట్రాలీ: 

రాష్ట్ర వ్యాప్తంగా పల్లె ప్రగతి ఐదు విడతల్లో విజయవంతంగా నిర్వహించబడింది. పల్లె ప్రగతి కార్యక్రమాలలో భాగంగా గ్రామ పారిశుధ్య  వ్యవస్థను మార్చేందుకు రాష్ట్రం లోని 12,789 గ్రామ పంచాయితీల్లో 1,276 కోట్లలో ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్లను కొనుగోలు చేశారు. గుంతలను పూడ్చడం, కూలిపోయే దశలో ఉన్న పాత ఇండ్లు, పాడుబడ్డ బావులు పూడ్చడం గ్రామంలో పేరుకుపోయిన చెత్తను ప్రతిరోజు డంపింగ్ యార్డ్ కు తరలించడానికి గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీలకు నీటి సరఫరాలకు ట్రాక్టర్లు ట్రాలీలు ట్యాంకర్లు పనిచేస్తున్నాయి.

పల్లె ప్రకృతి వనాలు, బృహత్ పల్లె ప్రగతి వనాలు: 

గ్రామాలలో ఆహ్లాదకరమైన వాతావరణం, పిల్లలకు ఆటస్థలం, పెద్దలకు నడక అవసరం. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రతి గ్రామాల్లో ఎకరానికి తగ్గకుండా రాష్ట్రంలో ఇప్పటివరకు 19472 పల్లె ప్రగతి వనాలు ఏర్పాటయ్యాయి. దీనికి తోడుగా 3297 ఎకరాల విస్తీర్ణంలో 2725 బృహత్ పల్లె ప్రగతి వనాలు వివిధ దశలో ఉన్నాయి. అంతేకాకుండా రాష్ట్రంలోని గ్రామ ప్రాంతాలలో 9242 కిలోమీటర్ల పొడవైన మల్టీ లేయర్ ప్లాంటేషన్ పూర్తి చేయడం జరిగింది. పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని 12,769 గ్రామపంచాయతీలో డంపింగ్ యార్డుల నిర్మాణం చేపట్టి పూర్తి చేయడం జరిగింది. ఈ డంపింగ్ యార్డుల  ద్వారా 36 లక్షల కి. గ్రా. కంపోస్ట్ ఎరువు సేకరించి వ్యవసాయానికి వినియోగించబడింది.

 వైకుంఠధామాల ఏర్పాటు:  

మరణించిన వారికి గౌరవ అంతక్రియల కోసం రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలలో వైకుంఠధామాలను ఏర్పాటు చేయడం జరిగింది.

ఓ.డి.ఎఫ్. ప్లస్ రాష్ట్రంగా:

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని 2019లో ఓ.డి.ఎఫ్  గా 2022లో ఓ.డి. ఎఫ్. ప్లస్ గా ప్రకటించింది. దేశంలో పెద్ద రాష్ట్రాల్లో 100 శాతం ఓ.డి.ఎఫ్. ప్లస్ గ్రామాలు ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.

తెలంగాణ క్రీడా ప్రాంగణాలు:

యువత ఆడుకోవడానికి ఎలాంటి క్రీడా వసతులు లేని పరిస్థితి నుండి మన రాష్ట్ర అవతరణ తర్వాత అన్ని వసతులను 14,456 గ్రామాలలో తెలంగాణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయడమైనది. ఈ క్రీడా ప్రాంగణంలో పిల్లలకు యువతకు క్రీడా సౌకర్యాలు కల్పించడమైనది.

మిషన్ భగీరథ:

మనిషికి ప్రాణాధారమైన సురక్షితమైన మంచినీటి సరఫరా చేసి తద్వారా ప్రజల కష్టాలు తీర్చడానికి, అంటూ వ్యాధులు అరికట్టడానికి , ఫ్లోరైడ్ సమస్యలు తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ కార్యక్రమానికి రూపకల్పన చేసింది. యుద్ధ ప్రాతిపదికన మిషన్ భగీరథ కార్యక్రమాన్ని పూర్తి చేసి, అన్నీ గ్రామలలోని ప్రతి ఇంటికి నల్లా సౌకర్యం సమకూర్చి, ప్రతిరోజు పరిశుభ్రమైన మంచినీరు సరఫరా చేస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే.

గ్రామీణ విద్యుత్తు సరఫరా: 

గ్రామ పరిధిలోని చీకట్లను తొలగించి ప్రజలకు భద్రత కల్పించడానికి నీతి దీపాలు పెట్టడం అత్యవసరమైనది. దానికోసం ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమంలో రూపాయి 314.94 కోట్ల ఖర్చుతో 2.99 లక్షల కొత్త విద్యుత్తు స్తంభాలను అమర్చి, వంగిపోయిన, తుప్పు పట్టిన స్తంభాల స్థానంలో కొత్త స్తంభాలను వేసి,  వదులుగా ఉన్న కరెంటు తీగలను బిగించి పటిష్టపరచడం జరిగింది. గతంలో నిర్లక్ష్యానికి గురైన దళిత, గిరిజన ఆవాస ప్రాంతాలలో 5.39 లక్షల మీటర్ల మూడవ వైర్ ను ఏర్పాటు చేయడం ద్వారా, వీధి దీపాలను అమర్చుకోవడం జరిగింది.

పరిపాలన సంస్కరణలు:

గతంలో తెలంగాణలో 8,690 గ్రామపంచాయతీలు ఉంటే, వాటి సంఖ్యను 12,769 కు పెంచింది. 3,146 ఆదివాసీలు, గిరిజనుల గూడాలు తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చింది. ప్రతి గ్రామానికి కచ్చితంగా ఒక గ్రామ కార్యదర్శి నియమించింది. గ్రామపంచాయతీ సిబ్బంది వేతనాన్ని 9500 రూపాయలకు పెంచింది. స్థానిక ప్రజా ప్రతినిధుల గౌరవ వేతనాలు పెంచింది. గ్రామాల అభివృద్ధిలో గ్రామ పంచాయతీల పాత్రను ప్రభుత్వం క్రియాశీలం చేసింది. కొత్త పంచాయితీరాజ్ చట్టం తెచ్చింది. ప్రజా భాగస్వామ్యాన్ని పెంచుతూ, గ్రామాల్లో పచ్చదనం వెల్లివిరియాలని, ప్రతి పల్లె పరిశుభ్రంగా ఉండాలని నిర్దేశించింది. గ్రామాల అభివృద్ధికి వార్షిక పంచవర్ష ప్రణాళికలు రూపొందించుకునే కొత్త సంప్రదాయాన్ని ప్రారంభించింది. నిధుల వినియోగంలో పారదర్శకతను పెంచేందుకు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులు, ప్రజా ప్రతినిధులపై చర్యలకు చట్టంలో కఠిన నిబంధనలను పెట్టి, పరిపాలనలో జవాబుదారీతనాన్ని పెంచింది.

పల్లె ప్రగతి కి ప్రజా సైన్యం:

ప్రభుత్వం సమగ్ర గ్రామీణ అభివృద్ధి విధానం అమలు కోసం పల్లెల ప్రగతికి ప్రజలను భాగస్వామ్యం చేయడం జరిగింది. పల్లె ప్రగతి కింద దేశంలోనే తొలిసారిగా గ్రామాలలో స్టాండింగ్ కమిటీలలో ప్రజలను భాగస్వాములను చేసింది. వర్క్స్ కమిటీ, శానిటేషన్ కమిటీ, స్ట్రీట్ లైట్స్ కమిటీ గ్రీన్ కవర్ కమిటీ ఇలా ఒక్కో గ్రామంలో నాలుగు కమిటీలు ఏర్పాటు అయ్యాయి. ఈ కమిటీల్లో 8,20,727 మందిని సభ్యులుగా ఎన్నుకున్నారు. వీరిలో దాదాపు సగం మంది అంటే 4,03,758 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు.

గ్రామీణ స్థానిక సంస్థలు నిధుల కొరత తీరుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం:

దేశంలో ఎక్కడా లేనివిధంగా కేంద్ర 15వ ఆర్థిక సంఘం నిధులకు సమానంగా రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులను జమచేసి పంచాయతీలకు విడుదల చేస్తున్నది. గ్రామ పంచాయతీలకు 85%, పంచాయతీలకు 10 శాతం, జిల్లా పరిషత్లకు 5 శాతం నిధులను ప్రభుత్వం అందజేస్తున్నది. అతి తక్కువ జనాభా కలిగిన చిన్న గ్రామపంచాయతీలకు కూడా కనీసం రూపాయి ఐదు లక్షల నిధులు అందుతున్నాయి. సెప్టెంబర్ 2019 నుండి ఇప్పటివరకు రూపాయి 11 వేల 162 కోట్లు స్థానిక సంస్థలకు విడుదలయ్యాయి.

అవార్డుల సెంచరీ:

పనితీరుకి, ప్రతిభకు గీటురాళ్లు అవార్డులు. తెలంగాణ విషయానికి వస్తే, దేశంలోనే అత్యధిక అవార్డులు సాధించిన రాష్ట్రంగా రికార్డు సృష్టించింది. ఒక పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అవార్డులు సాధించింది. ఇంకా గ్రామాలకు మంచినీటిని సరఫరా చేస్తున్న మిషన్ భగీరథ అవార్డులు సాధించింది.  ఈ అవార్డులు తెలంగాణ ప్రభుత్వం పనితీరుకే గాక, సీఎం కేసీఆర్ మానస పుత్రిక పల్లె ప్రగతి పథకాల పనితీరుకు, వాటి ఫలితాలకు నిదర్శనాలు. రాష్ట్రం లోని గ్రామీణ స్థానిక సంస్థలు  గత తొమ్మిది ఏళ్ల నుండి ఇప్పటి వరకు 94 అవార్డులను సాదించింది. నాడు తెలంగాణ వస్తే  ఏమోస్తది అన్న వాళ్ళకు ఈ పదేండ్ల ప్రగతి కచ్చితంగా చెంప పెట్టె. తెలంగాణలో సంపద పెంచు, ప్రజలకు పంచు అన్న నినాదంతో పాలన సాగుతున్నది. స్వరాష్ట్రమై ఇవ్వాళ తెలంగాణ ఆచారిస్తున్నది. దేశం అనుసరిస్తున్నది. అందుకే ఇది పదేండ్ల కైనా సాధ్యం కానీ పదేండ్ల పండుగ.