సిద్దిపేట, జూన్ 15: సిద్దిపేట పట్టణ శివారు ఇర్కోడ్ లో 6 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన మోడ్రన్ స్లాటర్ హౌజ్ ను రాష్ట్ర ఆర్థిక,వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మాత్యులు తన్నీరు హరీష్ రావు గారితో కలిసి ప్రారంభించిన రాష్ట్ర పురపాలక, పట్టణ అభివృద్ధి మరియు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు. స్లాటర్ హౌస్ లో ఏర్పాటు చేసిన (T-SERP) జిల్లా గ్రామీణభివృద్ధి సంస్థ మహిళా ఉత్పత్తులు, ఇర్కోడ్ నాన్ వెజ్ పచ్చళ్ళు, పంచాయతీ శాఖ వారి సేంద్రియ ఎరువు స్టాళ్లను మంత్రులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిద్దిపేట జిల్లా పరిషత్ చైర్పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జె పాటిల్, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, రాష్ట్ర మెడికల్ బోర్డు సభ్యులు పాల సాయిరాం తదితరులు.