గ్రేటర్ సిన్సినాటి తెలంగాణా అసోసియేషన్ (జిసిటిఎ) ఆధ్వర్యంలో ప్రథమ తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు సిన్సినాటిలోని వెస్ట్ చెస్టర్ కన్వెన్షన్ సెంటర్లో ఈనెల 7వ తేదీన చాలా వైభవంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో సిన్సినాటి, డేటన్, నార్తర్న్ కెంటకీకి చెందిన సుమారు 200 మంది ప్రవాస తెలంగాణావాసులు పాల్గొన్నారు. ముందుగా శ్రీ ప్రసాద్ మీగడ గారి ఆధ్వర్యంలో తెలంగాణ పిత ప్రొఫెసర్ జయశంకర్ మరియు తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం శ్రీమతి వాసవి బోయినపల్లి మరియు శ్వేత నాగులవంచ గారు జయ జయహే తెలంగాణ గీతాన్ని ఆలపించి కార్యక్రమాన్ని ఆరంభించారు. అవతరణ దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.
ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ శ్రీ చుక్కా రామయ్య గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్య అతిథిగా పాల్గొని శుభాకాంక్షలు అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న మిషన్ కాకతీయ, కేజీ టు పీజీ విద్యావిధానం గురించి ప్రవాస తెలంగాణావాసులకు వివరించారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు, పార్లమెంటు సభ్యులు శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ శ్రీ కర్నేప్రభాకర్ గారు మరియు శ్రీ దేవీప్రసాద్ గారు వీడియో మెసేజ్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరామ్ నిర్వహించిన క్విజ్ కార్యక్రమం చిన్న పిల్లలను ఎంతగానో ఆకట్టుకున్నది.. అనంతరం జరిగిన కార్యక్రమంలో నూతనంగా ఎన్నుకోబడ్డ కార్యవర్గ సభ్యులను అభినందించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేసిన కార్యవర్గ సభ్యులు గణేష్ కోట, పురమ రెడ్డి, రవి గుమ్మడవల్లి, లక్ష్మి రెడ్డి, సీతారాం, విష్ గట్ల, సురేష్, కృష్ణ, కిరణ్, భాను, నరసింహాచారి.