mt_logo

టొరొంటో నగరంలో అత్యంత వైభవంగా తెలంగాణ ఆవిర్బావ దినోత్సవం – ధూంధాం

తెలంగాణ కెనడా సంఘం (Telangana Canada Association –TCA) ఆధ్వర్యంలో తేది 6 జూన్ 2015 శనివారం రోజున మిస్సిస్సౌగలోని గ్లెన్ ఫారెస్టు సెకండరీ పాఠశాల ఆడిటోరియంలో తెలంగాణ కెనడా ధూంధాం పేరుతో తెలంగాణ ఆవిర్భావాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సంబురాల్లో 500 పైగా కెనడా తెలంగాణ వాసులు పాల్గొని విజయవంతం చేశారు.

మొదటగా కార్యదర్శి అతీక్ పాషా అందరికీ ఆహ్వానం పలికారు. అధ్యక్షులు శ్రీ చంద్ర స్వర్గం గారు సభ ప్రారంభానికి జెండా ఊపగా, శ్రీమతి నాగరాణి మంచికంటి గారు, శ్రీమతి సుజాతదేవి బెజ్జంకి, శ్రీమతి రమాదేవి గుజ్జుల, శ్రీమతి సుధ కంభాలపల్లి, శ్రీమతి ప్రియ ఈద, శ్రీమతి సాధ్విని తాటిపల్లి మరియు శ్రీమతి ధనలక్ష్మీ మునుకుంట్ల గారు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. శ్రీ రమేష్ మునుకుంట్ల గారు మరియు శ్రీ శ్రీనాథ్ కుందూరి గారు అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించి సభకు విచ్చేసిన వారందరితో మౌనం పాటింపచేసిన తర్వాత ఉత్సవాలను ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కెనడాలోని ఒంటారియో ప్రభుత్వ ఆరోగ్య శాఖామాత్యులు శ్రీమతి దీపిక దామెర్ల గారు మరియు భారత ప్రభుత్వ రాయబారి శ్రీ అఖిలేశ్ మిశ్రా గారు, విచ్చేసి నూతన తెలంగాణ నిర్మాణంలో కెనడాలోని తెలంగాణ ప్రవాసులంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ ఉత్సవాలలో తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ కోర్ కమిటీ సభ్యులు శ్రీ మోహన్ పట్లొల, శ్రీ రమేష్ చంద్ర, శ్రీ సంతోష్ పాతూరి మరియు కోర్ వర్కింగ్ కమిటీ సభ్యులు శ్రీ సుధీర్ మిర్యాల గారు ప్రత్యేకంగా న్యూజెర్సీ నుండి వచ్చి పాల్గొనటం విశేషం.

ఈ వేడుకలు కల్చరల్ సెక్రటరీ శ్రీ వేణు రోకండ్ల గారి ఆధ్వర్యంలో ఒగ్గుకథ, కోలాటం, పోతరాజు మరియు ఎన్నో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో దాదాపు 6 గంటలపాటు సభికులను అలరించాయి. మల్లన్న వేషంలో విజయకుమార్ తిరుమలాపురం తెలంగాణ యాస మరియు బాష, ఎల్లమ్మ వేషంలో శ్రీ మల్లిఖార్జున్ మదపు మరియు పోతరాజు వేషంలో శ్రీ గిరిధర్ క్రొవిడి గార్లు అద్భుతమైన లష్కర్ బోనాల ఊరేగింపు సభికులందర్నీ విశేషంగా ఆకర్షించాయి.

ఆఖరు నిమిషంలో కొన్ని అనివార్య కారణాల వలన కెనడా రాలేకపోయిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ అధ్యక్షులు ఆచార్య ఘంటా చక్రపాణి గారు ఈ క్రింది సందేశాన్ని పంపించారు.

ఈ కార్యక్రమాలన్నీ స్థానిక తెలంగాణ వారు చక్కటి తెలంగాణ భాణీలో ప్రదర్శించటం విశేషం. సభికులందరికీ తెలంగాణ కెనడా అసోసియేషన్ రుచికరమైన తెలంగాణ హైదరాబాద్ బిర్యాని మరియు ఇతర శాఖాహార వంటకాలతో భోజనాలు ఏర్పాటు చేశారు.

ఈ సంబురాలను తెలంగాణ కెనడా అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ చంద్ర స్వర్గం గారి ఆధ్వర్యంలో జరుగగా, ట్రస్టీ అధ్యక్షులు శ్రీ అఖిలేశ్ బెజ్జంకి, ఫౌండేషన్ కమిటీ అధ్యక్షులు శ్రీ కుందూరి శ్రీనాధ్, ఉపాధ్యక్షులు శ్రీ కోటేశ్వరరావు చిత్తలూరి, సెక్రటరీ సయ్యద్ అతీక్ పాషా, కల్చరల్ సెక్రటరీ శ్రీ వేణు రోకండ్ల, ట్రెజరర్ శ్రీ దేవేందర్ గుజ్జుల, జాయింటు ట్రెజరర్ శ్రీ శంతన్ నేరెల్లపల్లి, డైరెక్టర్లు శ్రీ వేణు గుడిపాటి, శ్రీ సంతోష్ గజవాడ, శ్రీ సమ్మయ్య వాసం, శ్రీ విజయ కుమార్ తిరుమలాపురం, శ్రీమతి రాధిక బెజ్జంకి, ట్రస్టీలు శ్రీ ప్రభాకర్ కంభాలపల్లి, శ్రీహరి రావుల, శ్రీ రాజేశ్వర్ ఈద, ఫౌండర్లు శ్రీ ప్రకాశ్ చిట్యాల, శ్రీ నవీన్ సూదిరెడ్ది, కలీముద్దీన్, శ్రీనివాస్ తిరునగరి, ముఖ్య వాలంటీర్లు శ్రీ మల్లికార్జున్ మదపు, శ్రీ మధుసూధన్ స్తోత్రభాస్యమ్, శ్రీ నర్సింహమూర్తి కలగోని, శ్రీ మురళి కందివనం, శ్రీ నవీన్ ఆకుల మరియు ఇతర వాలంటీర్సు సహకారంతో నిర్వహించగా ఫౌండర్ శ్రీ రమేశ్ మునుకుంట్ల సమన్వయ పరిచారు.

వ్యాఖ్యాతలుగా కుమారి మేఘ స్వర్గం మరియు కుమారి మనస్విని బెజ్జంకి వ్యవహరించారు. ఆఖరున ఉపాధ్యక్షులు శ్రీ కోటేశ్వరరావు చిత్తలూరి వందన సమర్పణతో కార్యక్రమాలు ముగిశాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *