mt_logo

Telangana formation Day Event in Boston, USA by NRI TRS USA

బోస్టన్‌లో ఆవిర్భావ దినోత్సవం మరియు తెరాస ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్నసందర్భంగా సంబరాలు చేసుకున్నారు. అరవింద్ తక్కళ్ళపల్లి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి NRI TRS – USA ప్రతినిధులు కళ్యాణ్ చక్రవర్తి, సంతోష్ రుద్రభట్ల, అరుణ్ పాల్గొన్నారు. వేణు మాదాడి కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించారు. TeNA అడ్వైజర్ పాపారావు గారు మాట్లాడుతూ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలతో తెలంగాణాను ప్రగతి పథంలో నడిపిస్తున్న తెరాస ప్రభుత్వాన్ని అభినందించారు. ఈ సందర్భంగా హార్వర్డ్ యూనివర్సిటీలో పేపర్ ప్రెజెంట్ చేయడానికి వచ్చిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధి వెంకన్న కేసీఆర్ గారు అందించిన ఆర్ధిక సహాయం వలన అమెరికాకు రాగలిగాను అని కృతజ్ఞతలు తెలియజేశారు. అడప సాంబయ్య, సోమేశ్వర్ రావు గార్లు కేక్ కట్ చేసారు. ఈ కార్యక్రమానికి టెణా సభ్యులు అమర్ కరిమిళ్ళ, విజయ్ కాకి, రాజేందర్ కలువల, వెంకన్న, రమేష్ డడిగల, సంజీవ్, శ్రీధర్, రామారావు, శ్రీ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *