వ్యవసాయ రంగంలో గత పదేళ్ళలో తెలంగాణ సాధించిన అద్భుత ప్రగతిని తెలంగాణ వ్యవసాయ శాఖ నివేదిక రూపంలో విడుదల చేసింది. నివేదికలోని ముఖ్యాంశాలు..
పంటల సాగు విస్తీర్ణం:
- 2014 నాటికి సాగు విస్తీర్ణం కోటి 31 లక్షల ఎకరాలు కాగా 2022-23 నాటికి అది 2 కోట్ల 38 లక్షల ఎకరాలకు పెరిగింది. పెరిగిన సాగు విస్తీర్ణం కోటి 7 లక్షల ఎకరాలు (81.6 %).
ధాన్యం ఉత్పత్తి:
- 2014-15 నాటికి ధాన్యం ఉత్పత్తి 68 లక్షల టన్నులు మాత్రమే ఉండగా, 2022-23 నాటికి రికార్డు స్థాయిలో సుమారు 3.00 కోట్ల టన్నులకు చేరుకున్నది.
ధాన్యం సేకరణ:
- తెలంగాణ ఏర్పడినప్పటి నుండి ఈనాటి వరకు రూ. లక్షా 33 వేల కోట్లతో, 722.92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
ఇతర పంటల సేకరణ:
- అలాగే ధాన్యం కాకుండా రూ.11,439.06 కోట్లతో ఇతర పంటల సేకరణ
సాగు నీరు:
- పెండింగ్ సాగునీటి ప్రాజెక్టుల పూర్తి, నూతన ఎత్తిపోతల పథకాల వల్ల వచ్చిన సాగునీటి ద్వారా పెరిగిన సాగు విస్తీర్ణం.
- ప్రపంచంలోనే అతిపెద్ద కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా 45 లక్షల ఎకరాలకు సాగు నీరు.
- పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా దక్షిణ తెలంగాణలో 6 జిల్లాల్లోని మరో 12.30 లక్షల ఎకరాలకు సాగు నీరు.
- రూ. 5349 కోట్లతో మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరించి, 8.93 టీఎంసీల సామర్థ్యంతో 15.05 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ
- సాగు నీటి శిస్తు రద్దు.
ఉచిత విద్యుత్తు :
- సాలీనా దాదాపు రూ.10,500 కోట్లు భరిస్తూ, రాష్ట్రంలోని రైతులందరికి 24 గంటల ఉచిత విద్యుత్తు.
రైతు బంధు :
- రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి ఏడాదికి రూ.10 వేల చొప్పున గత 11 విడతలలో రూ.72 వేల 815 కోట్లు
రైతు బీమా :
- రైతు బీమా పథకం ద్వారా ఇప్పటివరకు 1,11,320 మంది రైతు కుటుంబాలకు రూ. 5,566 కోట్ల బీమా పరిహారం చెల్లింపు.
రుణ మాఫీ
- తెలంగాణ ఏర్పడినప్పటి నుండి ఇప్పటివరకు
- మొదటి విడతలో 35.31 లక్షల రైతుల యొక్క రూ.16,144.10 కోట్లు రుణమాఫీ
- రెండో విడతలో ఇప్పటి వరకు 22 లక్షల 98 వేల 039 రైతుల యొక్క రూ.13,000.51 కోట్లు రుణమాఫీ (రూ.1,40,000/- వరకు). కొనసాగుతున్న మిగిలిన రైతుల యొక్క రుణమాఫీ ప్రక్రియ. (మొత్తం రుణ మాఫీ: రూ. 19,440 కోట్లు)
- 2014 నుండి రెండు విడతలలో కలిపి ఇప్పటివరకు 58.29 లక్షల రైతుల యొక్క రూ.29,144.61 కోట్లు రుణమాఫీ
వ్యవసాయ విస్తరణ:
- ఒక్కొక్కటి రూ.22 లక్షల వ్యయంతో రూ. 572 కోట్లతో 2601 రైతు వేదికల నిర్మాణం
- ప్రతీ 5వేల ఎకరాలకు ఒక ఏఈఓ
- క్రాప్ బుకింగ్ అవలంభిస్తున్న ఏకైక రాష్ట్రం
విత్తనాలు, ఎరువులు :
- సీజన్‌కు ముందే రైతులకు సరిపడా విత్తనాలు, ఎరువులు
- విత్తనాల నకిలీకి, కల్తీకి పాల్పడే వారిపై పీడీ యాక్టు
- దేశానికి అవసరమయ్యే పత్తి విత్తనాలలో 50 శాతం తెలంగాణాలోనే ఉత్పత్తి.
- ఇప్పటివరకు రూ. 981.51 కోట్లతో 41.59 లక్షల క్వింటాళ్ల రాయితీపై వివిధ రకాల పంటల విత్తనాలు సరఫరా.
వ్యవసాయ యాంత్రీకరణ:
- ఇప్పటివరకు మొత్తం రూ.963.26 కోట్లతో, 6.66 లక్షల మంది రైతులకు లబ్ధి.
- తెలంగాణ ఏర్పడిన తర్వాత ట్రాక్టర్లపై రూ.273.5 కోట్ల రవాణా పన్ను మాఫీతో పాటు రాష్ట్రం ఏర్పడక ముందటి రూ.41.6 కోట్ల రవాణా పన్ను రద్దు.
గోడౌన్ల సామర్థ్యం:
- 2014-15: 39.01 లక్షల మెట్రిక్ టన్నులు, ప్రస్తుతం 73.82 లక్షల మెట్రిక్ టన్నులు
మార్కెట్ కమిటీ రిజర్వేషన్లు:
- 196 వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులను రిజర్వేషన్ల ద్వారా భర్తీ.
- సీజన్ కు ముందే ఏ పంటలు వేయాలో, రైతులకు సూచించడానికి మార్కెట్ రీసర్చ్ & అనాలసిస్ వింగ్ ఏర్పాటు
సూక్ష్మ సేద్యం:
- రూ.1847.10 కోట్ల సబ్సిడీతో 7.79 లక్షల ఎకరాలలో సూక్ష్మ సేద్య సాగు
పంట నష్ట పరిహారం:
- పంట నష్టపరిహారం కింద ఇప్పటివరకు మొత్తం రూ.1794.76 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ
ఆయిల్ పామ్ సాగు:
- ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించడంలో భాగంగా ఆయిల్ పామ్ మిషన్ కింద వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఎకరాల సాగు లక్ష్యం
- ప్రస్తుతం రాష్ట్రంలో 1,94,954 ఎకరాలకు చేరిన ఆయిల్ పామ్ సాగు.
వ్యవసాయ విద్యకు ప్రోత్సాహం:
- తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నూతనంగా (11) వ్యవసాయ మరియు ఉద్యాన విద్య కళాశాలలు & పాలిటెక్నిక్ ల ఏర్పాటు
- వ్యవసాయ కళాశాలలు : 5
- వ్యవసాయ పాలిటెక్నిక్ లు: 4
- ఉద్యాన కళాశాలలు : 1
- ఉద్యాన పాలిటెక్నిక్ లు: 1
రాష్ట్ర తలసరి ఆదాయం
- 2014-15: రూ.1,12,162/-, 2022-23 : రూ.3,17,115/-
- పంటలకు గిట్టుబాటు ధర కోసం ఆహారశుద్ధి పరిశ్రమలు