తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డనాటినుంచీ సీఎం కేసీఆర్ భావి భారత పౌరులపై ప్రత్యేక దృష్టిపెట్టారు. బాల్యం అమూల్యమైనదని.. ఆ వయస్సులో వారికి అండగా నిలిస్తే దేశ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేవాళ్లమవుతామని ఆయన విశ్వసించారు. అందుకే వారిని దృష్టిలో పెట్టుకొనే అనేక మానవీయ పథకాలను రూపొందించారు. ఆరోగ్య లక్ష్మి, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సన్నబియ్యంతో బడిపిల్లలకు మధ్యాహ్న భోజనంలాంటి విప్లవాత్మక పథకాలతో తెలంగాణ బిడ్డలకు అండగా నిలిచారు. వైద్యరంగాన్ని బలోపేతం చేసి శిశుమరణాలను గణనీయంగా తగ్గించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌తో తెలంగాణలో బాల్యవివాహాలు తగ్గుముఖం పట్టాయని నోబెల్‌శాంతి గ్రహీత కైలాస్ సత్యార్థిలాంటి గొప్ప వ్యక్తి ప్రశంసించారు. అలాగే, ఆపరేషన్ ముస్కాన్‌తో తెలంగాణ సర్కారు బట్టీల వద్ద పనిచేస్తున్న బాలకార్మికులకు విముక్తి కల్పించిందని ఆయన మెచ్చుకొన్నారు. తాజాగా, తెలంగాణలోని అనాథ పిల్లలకు కొత్త జీవితాన్ని ప్రసాదించేందుకు సీఎం కేసీఆర్ మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకొన్నారు. అనాథ పిల్లలను చిల్డ్రన్స్ ఆఫ్ స్టేట్స్‌గా గుర్తించి, వారి బంగారు భవిష్యత్తుకు పునాదివేస్తామని ప్రకటించారు.
*అనాథలులేని రాష్ట్రంగా తెలంగాణ
అనాథలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ సర్కారు సంకల్పించింది. ఇందుకోసం సమగ్ర చట్టం రూపొందించాలని సంబంధిత మంత్రి, అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. అనాథ పిల్లలను అమ్మానాన్నలా సంరక్షించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు.
*ఏం చేస్తారంటే?
-అనాథలను ప్రభుత్వ బిడ్డలుగా గుర్తిస్తూ వారికి ప్రత్యేక స్మార్ట్ ఐడీకార్డులు జారీ చేయనున్నారు
-ఈ కార్డు ఉన్నవారికి ఆదాయ, కుల, ఇతర ధ్రువీకరణ పత్రాలకు మినహాయింపు ఇవ్వడం ఆలోచన చేస్తున్నారు.
-ముస్లింలకు సంబంధించిన యతీమ్‌ఖానాల (అనాథాశ్రమాలు)ను ప్రభుత్వ పరిధిలోకి తీసుకురానున్నారు.
-అనాథ పిల్లలందరినీ చిల్డ్రన్స్ ఆఫ్ స్టేట్‌గా గుర్తిస్తారు. వీరి సంక్షేమం కోసం నిధులు కేటాయిస్తారు.
– వీరికోసం కేటాయించిన నిధిని గ్రీన్‌చానల్‌లో పెట్టనున్నారు. అంటే ఆ నిధు లు ఆ ఏడాది ఖర్చు కాకపోతే మరుసటి ఏడాది వాటిని ఖర్చు చేసేందుకు అనుమతి ఇస్తారు.
-దీనిపై కూలంకషంగా చర్చించి ఓ పాలసీని రూపొందించనున్నారు.